భలే కిలాడీ.. ఫుడ్ డెలివరీ చేసినట్టుగా ఫొటో తీసుకుని..ఆ ప్యాకెట్ పట్టుకెళ్లిపోయింది

  • Published By: nagamani ,Published On : November 4, 2020 / 03:16 PM IST
భలే కిలాడీ.. ఫుడ్ డెలివరీ చేసినట్టుగా ఫొటో తీసుకుని..ఆ ప్యాకెట్ పట్టుకెళ్లిపోయింది

US Online delivary women Cheating : ఆన్ లైన్ లో హలో అంటూ చాలు నట్టింటికొచ్చేస్తున్నాయి మనకు కావాల్సిన వస్తువులు. తినే ఆహారం నుంచి కట్టుకునే బట్టల నుంచి ఆన్ లైన్ బిజినెస్ గా మారిపోయింది. ఈక్రమంలో మనకు తినాలని అనిపించినవి కష్టపడి వండుకోవాల్సిన పనిలేదు. ఒక్క క్లిక్ తో మన ప్లేట్లోకొచ్చి పడుతున్నాయి పలు రకాల ఆహారాలు.


ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ చేసే బోయ్ లు చేసే చీటింగ్ లు గురించి కూడా విన్నాం. స్టమర్లకు ఇవ్వాల్సిన ఆహార ప్యాకెట్లను జాగ్రత్తగా కట్ చేసి, ఫుడ్ ను దొంగిలించిన వీడియోలను, కాస్తంత తినేసి, మిగతాది డెలివరీ చేసిన ఎగ్జిక్యూటివ్ లనూ చాలా మందినే చూసుంటాం. కానీ, ఈ వీడియో ఇంకాస్త డిఫరెంట్. కాస్త వెరైటీగా ఉండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


కరోనా మహమ్మారి కారణంగా, నో కాంటాక్ట్ డెలివరీకి కస్టమర్లు ఇంపార్టెంట్స్ ఇస్తుండటంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు ఆహారాన్ని తీసుకుని వచ్చి, డోర్ దగ్గర పెట్టి, బెల్ కొట్టి వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించి ప్రకటనలు టీవీల్లో చూస్తున్నాం కూడా. తాము డెలివరీ ఇచ్చామని చెప్పడానికి సాక్ష్యంగా సదరు బోయ్ లు ఓ ఫొటో తీసుకుని వెంటనే తాము పనిచేస్తున్న సంస్థ యాప్ లో అప్ లోడ్ చేయాలి. అలా చేస్తేనే అది పర్ ఫెక్ట్ గా డెలివరీ అయినట్లు లెక్క. అలా డెలీవరీ చేయటానికి వచ్చిన ఓ యువతి తాను డెలివరీ ఇవ్వాల్సిన ప్యాకెట్ ను ఆర్డర్ ఇచ్చిన డోర్ ముందు పెట్టి..ఫోటో తీసుకుని ఆ తరువాత ఆ ప్యాకెట్ తీసుకుని వెళ్లిపోయింది.


ఈ దృశ్యాలు ఈ ఇంటి ముందు ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ ఆర్డర్ చేసిన వ్యక్తి ఓ Tik tok యూజర్. డెలీవరీ ఇచ్చి ఫోటో తీసుకుని తరువాత ఆ ప్యాకెట్ తీసుకుని వెళ్లిపోయిన ఆ యువతికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయిన సీసీ టీవీ పుటేజ్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ గా మారింది.


తాను ఆర్డర్ చేసిన ఫుడ్ ను డెలివరీ చేసేందుకు వచ్చిన యువతి, ఆ ప్యాక్ ను ఇంటి డోర్ ముందు పెట్టి, పిక్ తీసుకుని, ఆపై ఆ ప్యాక్ ను తీసుకుని దర్జాగా వెళ్లిపోయింది. ఈ వీడియోకు ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితరాల్లో సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. ఇక ఇందులో డెలివరీ ఎగ్జిక్యూటివ్ యూఎస్ కు చెందిన ‘డోర్ డాష్’ ఉద్యోగిని అని తేలింది.



జరిగిన ఘటనపై స్పందించిన డోర్ డాష్ ఉన్నతాధికారి, ఈ తరహా ఘటనల్ని సహించబోమని, కస్టమర్ కు క్షమాపణలు చెబుతున్నామని..మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని తెలిపారు. వైరల్ ఈ వీడియోను మీరు కూడా చూడండీ..