ఆయింట్ మెంట్ తో కరోనాకు చెక్..US FDA ఆమోదం

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 04:13 PM IST
ఆయింట్ మెంట్ తో కరోనాకు చెక్..US FDA ఆమోదం

covid 19

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇంకా కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని వ్యాక్సిన్ లు మూడో దశలో కొనసాగుతూ విజయవంతంగా పనిచేస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వచ్చేందుకు సమయం పట్టే అవకాశాలున్నాయి.



ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆయింట్ మెంట్ ను కనిపెట్టింది. ఆయింట్ మెంట్ పేరు T3X  అని తెలిపింది. ముక్కు ద్వారా వ్యాపించే కరోనాకు ఇది చెక్ పెడుతుందని, దీనికి USFDA ఆమోదం లభించిందని తెలిపింది. వైద్యులు సిఫార్సు చేసే ఎలాంటి మందుల చిట్టీ అవసరం లేదని వెల్లడించింది.

T3X‌తో చికిత్స చేసిన 30 సెకన్ల తరువాత ఎలాంటి వైరస్ కనిపించలేదని పలు నివేదికల్లో తెలిసిందని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్ టెక్నాలజీ సంస్థ స్థాపకుడు, సీఈవో డాక్టర్ బ్రియాన్ హ్యూబర్ వెల్లడించారు.



కరోనా వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై ఈ ఆయింట్‌మెంట్ ప్రభావంతంగా పనిచేస్తుందని.. సెకన్లల వ్యవధిలోనే వైరస్‌ విస్తరిస్తే శక్తిని ఇది నిర్వీర్యం చేస్తుందని కంపెనీ వెల్లడించింది. బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి రక్షణ కోసం దీనిని ఉపయోగించవచ్చునని తెలిపింది.