కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సాయం

చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 10:31 AM IST
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సాయం

చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 34 వేల మందికి ఈ వ్యాధి సోకింది. వీరిలో 5 వేల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక వుహాన్ లో 40 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.

మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. చైనాతో పాటు ఇతర ప్రభావిత దేశాలకు 100 మిలియన్ డాలర్ల సహాయాన్ని అమెరికా అందించనుంది. ఈ మేరకు చైనా అధ్యక్షడు జిన్ పింగ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడారు. చైనాలోని ఆరోగ్య పరిస్థితులను ట్రంప్ కు వివరించారు. 

చైనాను కరోనా పట్టి పీడిస్తోంది. వైరస్ బారిన పడి వందల మందిలో చనిపోతున్నారు. దీంతో పలు నగరాలు శ్మశానంలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వూహాన్ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ఒక్కరోజే మరో 88 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

హుబెయ్ ప్రావిన్సు, రాజధాని వూహాన్ ఇంకా దిగ్భందనంలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. భారత్‌తో సహా 25 దేశాల్లో ఈ వైరస్ పాకుతోంది. దీంతో పలు దేశాలు చైనాకు వెళ్లకుండా…ఆంక్షలు విధిస్తున్నాయి. దీనిపై డబ్ల్యూవో దీనిపై స్పందించింది. వైరస్ సోకిన వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.