US : అమెరికాలో తొలి మరణ శిక్ష

అప్పట్లో జైల్లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్‌కు బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు కోసం డొనాల్డ్‌ గ్రాంట్ ఓ హోటల్లో దోపిడీకి యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు హోటల్ సిబ్బందిని హత్య చేశాడు...

US : అమెరికాలో తొలి మరణ శిక్ష

Us

US’ First Execution : అమెరికాలో ఈ ఏడాది తొలి మరణ శిక్ష అమలైంది. ఓక్లహోమా రాష్ట్రంలో 46ఏళ్ల డొనాల్డ్ ఆంథోనీ గ్రాంట్‌కు మరణ శిక్ష అమలుచేశారు. ప్రాణాంతక లెథల్ ఇంజెక్షన్ ద్వారా అతనికి మరణ శిక్ష అమలుచేశారు. విషపూరితమైన ఈ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 2001లో జరిగిన జంట హత్యల కేసులో డొనాల్డ్‌ గ్రాంట్‌ దోషిగా తేలడంతో అతనికి కోర్టు మరణ శిక్ష విధించింది. అప్పట్లో జైల్లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్‌కు బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు కోసం డొనాల్డ్‌ గ్రాంట్ ఓ హోటల్లో దోపిడీకి యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు హోటల్ సిబ్బందిని హత్య చేశాడు.

Read More : Shooting Postpones: ఆగిన సినిమాలు.. సెట్స్ మీదకెప్పుడు? షూటింగ్ ఎప్పుడు?

ఈ కేసులో 2005లో అతనికి మరణ శిక్ష పడింది. దీన్ని సవాల్ చేస్తూ గ్రాంట్ ఇప్పటివరకూ అనేకసార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. చిన్నతనంలో తాగుబోతు తండ్రి చేతిలో చిత్రహింసలకు గురవడంతో.. తాను ఫెటల్ ఆల్కాహాల్ సిండ్రోమ్, బ్రెయిన్ ట్రామాతో బాధపడుతున్నట్లు గతంలో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నాడు. అయితే కోర్టు వాటిని కొట్టేసింది. ఇక మరోసారి వేసిన పిటిషన్‌లో మరణ శిక్ష విధించే పద్దతిపై గ్రాంట్ ఆందోళన వ్యక్తం చేశాడు. యూఎస్ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోవడంతో గ్రాంట్‌కు మరణ శిక్ష అమలుచేశారు. నిజానికి అమెరికాలో దాదాపు 23 రాష్ట్రాలు మరణ శిక్షలను రద్దు చేశాయి. ఓక్లహోమా సహా పలు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ మరణ శిక్షలు అమలవుతున్నాయి. ఈ ఏడాది అమెరికాలో పదుల సంఖ్యలో మరణ శిక్షలు అమలయ్యే అవకాశం ఉంది. ఇందులో టెక్సాస్, ఓహియో రాష్ట్రాల్లోనే ఎక్కువ మరణ శిక్షలు అమలుకానున్నట్లు తెలుస్తోంది.