PPE కిట్ అడిగిందని కరోనా అంటించిన డాక్టర్.. కోర్టుకెక్కిన నర్సు

  • Published By: nagamani ,Published On : October 29, 2020 / 01:26 PM IST
PPE కిట్ అడిగిందని కరోనా అంటించిన డాక్టర్.. కోర్టుకెక్కిన నర్సు

US Florida : కరోనా కాలంలో వారియర్స్ గా నిలిచి డాక్టర్లు..నర్సులు..వైద్య సిబ్బందిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కనిపించని మహమ్మారితో పోరాడే డాక్టర్లు..నర్సులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వైద్య సిబ్బంది ప్రాణాల్ని పణ్ణంగా పెట్టి చేసిన సేవల్ని..త్యాగాలను ఎన్నటికీ మరచిపోలేం.


కానీ ఓ డాక్టర్ చేసిన పని వైద్య సిబ్బంది పరువు తీసేలా తయారైంది. రోగులకు వచ్చిన కరోనాను తగ్గించాల్సిన డాక్టరే తన దగ్గర పని చేసే నర్సుకు కావాలనే కరోనా వైరస్ అంటించాడు. దీంతో ఆ నర్సు కోర్టును ఆశ్రయించింది. కావాలనే తనపై దగ్గి డాక్టర్ తనకు కరోనా వైరస్ ను అంటించాడని ఆరోపిస్తూ ఆ నర్సు కోర్టులో పిటీషన్ వేసిన ఆసక్తికర ఘటన అమెరికాలోని ఫ్లొరిడా‌లో చోటుచేసుకుంది. దీనిపై కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో అనే విషయం ఆసక్తికరంగా మారింది.


వివరాల్లోకి వెళితే..అమెరికాలోని ఫ్లొరిడా‌కు చెందిన వెనిస్ జీన్ బాప్టిస్ట్ అనే నర్సు డాక్టర్ జోసెఫ్ పిపెరాటో వద్ద నర్సుగా పని చేస్తోంది. అతడు గత మార్చి నెలలో మియామి బీచ్‌లో జరిగిన డ్యాన్స్ ఫెస్టివల్‌కు వెళ్లి వచ్చాడు. ఆ తరువాత అనారోగ్యానికి గురి కావటంతో వెనిస్ ‘‘డాక్టర్ తో కరోనా టెస్టులు చేయించుకోండి’’ అని చెప్పింది. అనంతరం ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ‘‘డాక్టర్..హాస్పిటల్ లో పనిచేసే తమకు PPE కిట్లు ఇవ్వాలని కోరింది.


ఆ మాటతో డాక్టర్ జోసెఫ్ కు చిరాకొచ్చింది. ఏంటీ నాకు కరోనా వచ్చిందనీ..అది మీకు అంటుకుంటుందని ఇలా ముందుగానే నిర్ణయించేసి నన్ను అవమానిస్తున్నామంటూ మండిపడ్డారు. ఏ నీకు రాదనుకున్నావా? అంటూ ఆమెవైపు తిరగి దగ్గాడు. తరువాత ‘‘ఇప్పుడు నాకు కరోనా ఉంటే..నీకు కూడా వచ్చేస్తుందిగా..’’ అంటూ హేళన చేశాడు.


అది జరిగిన కొన్ని రోజులకే నర్సు వెనిస్ జీన్ బాప్టిస్ట్ కూడా కరోనా బారిన పడింది. దాంతో ఆమె రెండేళ్ల కొడుక్కు కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకుంది. తనకు ఆ పరిస్థితి తీసుకువచ్చిన డాక్టర్ పై మండిపడింది.


కావాలనే తనకు కరోనా అంటించాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో కోరింది. కానీ డాక్టర్ జోసెష్ మాత్రం నర్సు వెనిస్ చేసిన ఆరోపణలతో తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ పిటీషన్ పై న్యాయస్థానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.