ముఖానికి మాస్కులు వేసుకుంటే డైపర్లు వేసుకున్నట్లే..అలాంటివి వేసుకుని మా రెస్టారెంట్ కు రావద్దు

ముఖానికి మాస్కులు వేసుకుంటే డైపర్లు వేసుకున్నట్లే..అలాంటివి వేసుకుని మా రెస్టారెంట్ కు రావద్దు

Florida restaurant compare face mask with diper : కరోనా వచ్చాక ప్రతీఒక్కరూ ముఖాలకు మాస్క్ లేనిదే బైటకు రావటంలేదు. అటువంటిది హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళితే మాస్క్ వేసుకోకుండా రావద్దని ప్రకటనల్ని చూసే ఉంటాం. కానీ ఓ రెస్టారెంట్ మాత్రం ఫుల్ డిఫరెంట్ ప్రకటన ఇచ్చింది. ‘‘మా రెస్టారెంట్ కు వచ్చేవారు ముఖానికి డైపర్లు వేసుకుని రావద్దు’అంటూ బోర్డు పెట్టింది. అదేంటీ ముఖానికి ఎవరన్నా డైపర్లు వేసుకుంటారా? అని షాక్ అవుతున్నారా? కానేకాదు..సదరు రెస్టారెంట్ ఉద్ధేశమేమంటే..మాస్కుల్ని డైపర్లతో పోల్చింది. అందుకే ముఖానికి డైపర్లు వేసుకుని మా రెస్టారెంట్ కు రావద్దని ప్రకటించటంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమెరికా ఫ్లోరిడాలోని హెర్నాండో కౌంటీలో ఉన్న ‘బెక్కి జాక్ ఫుడ్ షాక్’ అనే రెస్టారెంట్ ఎంట్రన్స్ ముందు ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటోలో ఫేస్ మాస్కులను డైపర్లతో పోల్చినట్లుగా ఉంది. ఆ ఫోటోమీద ‘మా రెస్టారెంట్‌కు వచ్చేవారు ఫేస్ డైపర్లు ధరించాల్సిన అవసరం లేదు… అందరికీ స్వాగతం’ అని ఉంది. దాన్ని ఫేస్‌బుక్‌లో కూడా షేర్‌ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. దీన్ని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా అదింకా నిర్మూలన కాలేదు. అటువంటి సమయంలో ఇటువంటి ప్రకటనలు బాధ్యతారాహిత్యమని అంటున్నారు. తాము ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతోంటే.. ఇలా బాధ్యత లేకుండా చేయటం సరైంది కాదని అంటున్నారు.

ఈ రెస్టారెంట్ ఇంతటితో ఊరుకోకుండా..మాస్కు వాడకం అవసరం లేదు అంటూ షేర్ చేసిన ఈ ఫేస్‌బుక్‌ పోస్ట్‌కు రెస్టారెంట్ యజమాని స్వయంగా క్యాప్షన్ రాశారు. దీంట్లో ఫోటోకు ఒక ట్యాగ్ కూడా పెట్టారు. తమ రెస్టారెంట్‌కు వచ్చేవారు ఫేస్‌ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని..రాసిన ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొన్ని వందలసార్లు షేర్ కావడం మరో విశేషం. కొంతమంది యూజర్లు ఈ ప్రకటనను స్వాగతిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇటువంటి పిచ్చి ప్రకటనలు మానుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రకటన మాత్రం వైరల్ గా మారింది..