OMG: సాంబార్ మసాలాలో బ్యాక్టీరియా

OMG: సాంబార్ మసాలాలో బ్యాక్టీరియా

అమెరికాలో అమ్ముడవుతోన్న భారత్‌కు చెందిన ఎమ్డీహెచ్ సాంబార్ మసాలా ప్యాకెట్లలో బ్యాక్టీరియా ఉండటాన్ని గమనించారు. మసాలా ప్యాకెట్లలో సాల్మొనెల్లా అనే హానికారక బ్యాక్టీరియా కారక పదార్థాలు ఉన్నాయని ఆ బ్రాండ్‌ను అమెరికా రిటైల్ మార్కెట్ నుంచి అమెరికా ఫుడ్ డ్రగ్ అథారిటీ తొలగించింది. 

‘బ్యాక్టీరియా ఉందని అనుమానించి సాంబార్ మసాలా ప్యాకెట్లను ప్రయోగశాలల్లో ఎఫ్‌డిఎ పరీక్షలు జరిపారు. అందులో సాల్మోనెల్లా ఉందని ఫలితాలు వచ్చాయి’ అని ఎఫ్‌డిఎ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉత్తర క్యాలిఫోర్నియా రిటైల్ స్టోర్‌ల నుంచి ఈ సాంబార్ మసాలా ప్యాకెట్లను తొలగించారని సమాచారం. 

ఈ బ్యాక్టీరియా కారణంగా కడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటివి వచ్చే ప్రమాదాం ఉందని ఎఫ్‌డిఎ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. వ్యాధి నియంత్రణ శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ప్రాణాపాయం కూడా రావొచ్చని అభిప్రాయపడ్డారు. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వారు మరణించే ప్రమాదం కూడా ఉందని ఎఫ్‌డిఎ వివరించింది.