అమెరికాలో జాబ్‌లే జాబ్‌లు

అమెరికాలో జాబ్‌లే జాబ్‌లు

యునైటెడ్ స్టేట్స్‌లో కొలువుల కొరతే లేదంట. జనవరి నుంచి అక్టోబరు నెల వరకూ తీసిన అంచనాల ప్రకారం.. అక్కడి ప్రభుత్వం 2లక్షల 66వేల జాబ్‌లు ఉన్నట్లు వెల్లడించింది. లేబర్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగం 3.6శాతం నుంచి 3.5శాతానికి తగ్గింది. 

దాంతో పాటు గత సంవత్సరంతో పోలిస్తే.. రోజువారీ వేతనాలు కూడా 3.1శాతం పెరిగాయి. వ్యాపారాభివృద్ధి పెరుగుతుండటంతో నిరుద్యోగులను వెతికి పట్టుకుని ఉద్యోగాలిస్తున్నారు. వినియోగదారులను సంతృప్తిపరిచే విధంగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు. 

ఈ మేర ఎగుమతులు తగ్గించి వ్యాపారాన్ని స్థానికంగా విస్తరిస్తున్నారు. ఈ వేసవి నుంచి ఊపందుకున్న కొలువుల వేగం సగటున 2లక్షల 5వేలకు చేరుకోగా, కేవలం జులై నెలలో మాత్రమే లక్షా 35వేల జాబ్‌లు జాబ్ లు పొందారు.