కడుపును కోసి బిడ్డను బయటకు తీసిన మహిళా ఖైదీని చంపేశారు

కడుపును కోసి బిడ్డను బయటకు తీసిన మహిళా ఖైదీని చంపేశారు

Lisa Montgomery : గర్భవతిగా ఉన్న ఓ మహిళ కడుపును కోసి పసికందును బయటకు తీసి అత్యంత దారుణానికి పాల్పడిన లీసా మోంట్ గోమేరి (Lisa Montgomery) మరణశిక్ష అమలు చేసింది అమెరికా ప్రభుత్వం. లీసాకు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు. అధ్యక్ష పదవి నుంచి కొద్ది రోజుల్లో వైదొలగనున్న ట్రంప్ ప్రభుత్వం మహిళా ఖైదీకి మరణ శిక్షను అమలు చేసింది. హత్య కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు తీర్పు మేరకు..52 ఏళ్ల లీసా మహిళకు మరణ శిక్షను విధించింది.

అసలు ఏం జరిగింది

54 సంవత్సరాలున్న లీసా మోంట్ గో మేరీ అనే మహిళ…2004లో ముస్సోరిలోని బోబి స్టినెట్ అనే గర్భవతిని పాశవికంగా హత్య చేసింది. కడుపులోకి పేగును కోసి 8 నెలల పసికందును బయటకు తీసింది. బిడ్డ బతికినా..బోబి చనిపోయింది. ఈ కేసులో లీసాను అరెస్టు చేశారు. 2007లో కోర్టు మరణశిక్షను విధించింది. అయితే..లీసా..శారీరక, మానసిక వ్యాధులు, ఒత్తిడితో బాధ పడుతోందని ఆమె లాయర్ వాదించారు. ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. కానీ..అందుకు కోర్టు నిరాకరించింది. మరణ శిక్షను విధిస్తూ..తీర్పును వెలువరించింది. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి 01.31 గంటలకు లీసాకు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు. వాస్తవానికి లీసాకు ఈనెల 8వ తేదీన శిక్ష పడాల్సి ఉంది. ఇద్దరు అటార్నీలకు కరోనా సోకడంతో..ఆమె శిక్షను 2021 జనవరి 12కి వాయిదా వేశారు.