US Gun Culture : గన్ కల్చర్‌కు ఎండ్‌ కార్డ్‌ పెట్టాలంటున్న ప్రెసిడెంట్ బైడెన్.. కానీ..గన్ క్యారీ చేసేందుకు బిల్లు తీసుకొస్తున్న రాష్ట్రాలు

టెక్సాస్‌ స్కూల్‌ కాల్పుల ఘటన తర్వాత.. యూఎస్‌లో గన్ కల్చర్ కట్టడి చేయాలని డిమాండ్‌ వినిపించింది. అధ్యక్షుడు బైడెన్ కూడా అదే అన్నారు. ఐతే ఓ రాష్ట్రంలో మాత్రం టీచర్లు గన్ క్యారీ చేయొచ్చంటూ బిల్‌ పాస్‌ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

US Gun Culture : గన్ కల్చర్‌కు ఎండ్‌ కార్డ్‌ పెట్టాలంటున్న ప్రెసిడెంట్ బైడెన్.. కానీ..గన్ క్యారీ చేసేందుకు బిల్లు తీసుకొస్తున్న రాష్ట్రాలు

Us Gun Culture

US gun culture :  పేరుకే అగ్రరాజ్యం.. వ్యవస్థలో ఎన్ని లుకలుకలు ఉన్నాయో.. ఒక్క సీన్‌తో బయటపడింది. టెక్సాస్‌ స్కూల్‌ కాల్పుల ఘటన తర్వాత.. యూఎస్‌లో గన్ కల్చర్ కట్టడి చేయాలని వాల్డ్‌వైడ్‌గా డిమాండ్‌ వినిపించింది. అధ్యక్షుడు బైడెన్ కూడా అదే అన్నారు. ఐతే ఓ రాష్ట్రంలో మాత్రం టీచర్లు గన్ క్యారీ చేయొచ్చంటూ బిల్‌ పాస్‌ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

టెక్సాస్‌ స్కూల్‌ కాల్పుల ఘటన ఇంకా కళ్లముందే కదులుతోంది. 21మంది విద్యార్థులు, ముగ్గురు స్కూల్ స్టాఫ్‌.. తుపాకీకి బలయ్యారు. ఈ ఘటనపై అధ్యక్షుడు బైడెన్‌ ఎమోషనల్‌ అయ్యారు. తుపాకీ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాలని పిలుపునిచ్చారు. నిజానికి బైడెన్ అధికారంలోకి రాగానే.. గన్ కల్చర్‌కు చెక్‌ పెట్టేందుకు ఘోస్ట్ గన్స్ చట్టాన్ని తీసుకువచ్చారు. తుపాకి సంస్కృతికి చరమగీతం పాడాలని అధ్యక్షుడు అనుకుంటుంటే.. రాష్ట్రాల్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయ్. దీంతో అధ్యక్షుడి రూట్ ఒకవైపు.. రాష్ట్రాల రూట్ మరొకవైపు అన్నట్లుగా యూఎస్‌ లుకలుకలను ఈ ఘటనలు బయటపెడుతున్నాయ్.

18 నుంచి 21 ఏళ్ల వయసు వారంతా గన్ వాడొచ్చని టెక్సాస్ స్టేట్‌ బిల్ పాస్‌ చేయగా.. అదే స్కూల్ ఘటనకు కారణం అయింది. ఐతే ఇప్పుడు ఒహాయో స్టేట్ తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు దారి తీస్తోంది. టీచర్లు, సిబ్బంది స్కూళ్లలోకి తమ గన్‌లు తెచ్చుకునేందుకు అనుమతించేలా ఓ బిల్ తీసుకువచ్చారు. దీనికి ఆ రాష్ట్ర చట్టసభలు ఆమోదం కూడా తెలిపాయ్. ఐతే ముందుగా గన్ ఎలా ఉపయోగించాలో నేర్పించే ట్రైనింగ్‌ క్లాసెస్‌లో టీచర్లు పాల్గొనాల్సి ఉంటుంది. టెక్సాస్‌ ఘటనను దృష్టిలో పెట్టుకొనే ఈ బిల్లు తీసుకువచ్చారు. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం కరెక్ట్ అనిపించినా.. ఇదే పరిష్కారం కాదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

టెక్సాస్‌లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. తుపాకీ సంస్కృతిని కట్టడి చేయడమే మార్గం. స్కూళ్లలోకి గన్‌లు అనుమతించడంలాంటి ముందు జాగ్రత్త చర్యలతో సమస్యకు పూర్తిగా పరిష్కారం లభించే అవకాశం ఉండదు. గన్ కల్చర్ వ్యవహారంలో కొందరు సెనేటర్లలో మార్పు రావాలని బైడెన్ అంటున్నారు. ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకొని.. తైవాన్‌, యుక్రెయిన్‌కు అండగా ఉంటామని బిల్డప్ ఇచ్చే అమెరికా.. సొంతింటి సంసారాన్ని ఎందుకు బాగు చేసుకోవడం లేదు. సెనేటర్లను ఎందుకు ఒక్కతాటి మీదకు తీసుకురావడం లేదు.. ముందు జాగ్రత్తలు కాకుండా.. సమస్యకు ఓ మందు కనిపెడితే.. గన్‌ కల్చర్‌కు ఎండ్ పడుతుంది కదా ! ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో జరుగుతోన్న చర్చ.

అమెరికాలో ప్రతీ వంద మందిలో 90మంది దగ్గర తుపాకులు ఉన్నాయ్. అమెరికా ప్రభుత్వం గట్టిగా అనుకోవాలే కానీ.. ఇలాంటి సంస్కృతికి అడ్డుకట్ట వేయడం పెద్ద మ్యాటరేం కాదు. కానీ అనుకోవడం లేదు. అదే ఇక్కడ పెద్ద సమస్య ! అమెరికాలో రోజుకు సగటున సుమారు 50మందికి పైగా తుపాకులకు బలి అవుతున్నారు. గన్‌ సంపాదించడం అమెరికా పౌరులకు సులువైన వ్యవహారం. 18 ఏళ్ల వయసు ఉండి… నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. లైసెన్స్‌ దొరుకుతుంది. దాడులు జరిగినప్పుడు ఏం చేయాలో చెప్పడంతో కంపేర్‌ చేస్తే.. దాడులు జరగకుండా చూడడం బెటర్‌. అదే ఇప్పుడు అమెరికన్ సర్కార్ మిస్ చేస్తోంది. రాష్ట్రాల తీరు రాష్ట్రాలది.. అధ్యక్షుడి మాట అధ్యక్షుడిది అన్నట్లుగా పరిస్థితి మారింది.