US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..

అమెరికాలో ఓ రచయిత్రి చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'మీ భర్తను చంపడం ఎలా?' ('How To Murder Your Husband')అనే ఆర్టికల్ రాసిన సదరు రచయిత్రి ఎవ్వరూ ఊహించని విధంగా తన భర్తను కాల్చి చంపేసిన ఘటన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..

How To Murder Your Husband Article Writer Killed Her Husband

How to murder your husband : అమెరికాలో ఓ రచయిత్రి చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘మీ భర్తను చంపడం ఎలా?’ (‘How To Murder Your Husband’)అనే ఆర్టికల్ రాసిన సదరు రచయిత్రి ఎవ్వరూ ఊహించని విధంగా తన భర్తను కాల్చి చంపేసిన ఘటన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ‘మీ భర్తను చంపడం ఎలా?’ అనే వ్యాసం రాసిన ఆ రచయిత్రి పేరు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ. ఆమె భర్త పేరు డేనియల్. గతంలో కొన్ని పుస్తకాలు రాసిన నాన్సీ ‘మీ భర్తను చంపడం ఎలా?’ అనే ఆర్టికల్ రాసింది. ఆమె ఇటీవల ఆమె భర్త డేనియల్ ను కాల్చి చంపేసింది..!

రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ..అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం పోర్ట్ లాండ్ లో నివసిస్తుంటుంది. ఆమె ‘మీ భర్తను చంపడం ఎలా?’ అనే వ్యాసంతో పాటు పలు నవలలు కూడా రాసిని నాన్సీ ఊహించని రీతిలో ఆమె తన భర్త డేనియల్ ను వెనుక నుంచి కాల్చి చంపేసింది. నాన్సీ భర్త డేనియల్ బ్రోఫీ ఓ చెఫ్. ఓరెగాన్ కలినరీ ఇన్ స్టిట్యూట్ లో కుకింగ్ పాఠాలు చెబుతుంటాడు. తన ఇన్ స్టిట్యూట్ లోనే ఓ కిచెన్ లో ఉండగా..నాన్సీకి ఏమైందో తెలీదుగానీ తుపాకీతో వెనుక నుంచి రెండు రౌండ్లు కాల్చింది. రెండు బుల్లెట్లు డేనియల్ గుండెలోంచి దూసుకుపోయాయి. దీంతో అతను కుప్పకూలిపోయి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

తుపాకీ శబ్దం విని ఇన్ స్టిట్యూట్ విద్యార్థులు..కొలీగ్స్ వచ్చి చూడగా డేనియల్ రక్తపుమడుగులో పడి ఉన్నాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోర్ట్ లాండ్ పోలీసులు రచయిత్రి నాన్సీని అరెస్ట్ చేశారు. విచారణ జరిపి ఆమెను దోషిగా నిర్ధారించారు.

విచారణలో నాన్సీ తెలిపిన విషయానికి తుపాకీ కాల్పులకు సంబంధం లేదని విషయంతెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. విచారణలో నాన్సి గతంలో భర్త డేనియల్ తో కలిసి ఓ గన్ షోకు వెళ్లిన సందర్భంగా గ్లాక్ పిస్టల్ ను కొన్నాడని చెప్పింది. కానీ పోలీసులను ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే… ఆ గ్లాక్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా..ఆ పిస్టల్ ను ఎవరూ ఉపయోగించిన దాఖలాలు కనిపించలేదు. మరి..నాన్సీ డేనియల్ ను ఏ తుపాకీతో కాల్చిందని పోలీసులకు ఎన్నో అనుమానాలు వచ్చాయి. అదే విషయాన్ని పోలీసులు నాన్సిని ప్రశ్నించగా..మరో ఆసక్తికర సమాధానం చెప్పింది.

ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ నుంచి పిస్టల్ పైన ఉండే స్లైడ్ ను, బ్యారెల్ ను కొనుగోలు చేసానని..తమ గ్లాక్ పిస్టల్ కున్న స్లైడ్, బ్యారెల్ విప్పి, తాను ఆన్ లైన్ లో కొన్న స్పేర్ పార్టులను ఆ తుపాకీకి అమర్చింది. పిస్టల్ తో పాటు వచ్చిన బుల్లెట్లు కాకుండా, వేరే బుల్లెట్లు ఉపయోగించానని..భర్తను కాల్చిన అనంతరం, ఆ స్పేర్ పార్టులను విప్పదీసి, మళ్లీ ఒరిజినల్ పార్టులు బిగించి, తుపాకీని సేమ్ ప్లేస్ లో పెట్టేశానని తెలిపింది.

ఈ కారణంగానే, గ్లాక్ పిస్టల్ తో ఎలాంటి కాల్పులు జరగలేదని పోలీసులు భావించారు. కానీ విచారణలో నాన్సీ చెప్పింది విన్నాక వారికి మతిపోయింది. త్వరలోనే ఈ కిల్లర్ రచయిత్రికి శిక్ష ఖరారుకానుంది అని పోలీసులు తెలిపారు. నాన్సీ గతంలో ‘రాంగ్ హజ్బెండ్’, ‘హెల్ ఆన్ ఏ హార్ట్’ అనే పుస్తకాలు రాసింది. కానీ అనుకున్నంతగా ఆ నవలలకు స్పందన రాలేదు.

కాగా 63 ఏళ్ల నాన్సి క్రాంప్టన్ బ్రోఫీ, జూన్ 2018లో తన భర్త డేనియల్ బ్రోఫీని చంపినట్లు ఆరోపణలు రాగా..అప్పటినుంచి కేసు కొనసాగింది. ఎట్టకేలకు మే 26, 2022న ఆమే భర్తను చంపినట్లుగా నిర్ధారించబడింది. దీంతో ఆమెకు త్వరలోనే శిక్ష ఖరారుకానుంది.