US Man : మృతదేహం చుట్టూ 125 పాములు, 14 అడుగుల కొండచిలువ కూడా

ఇంట్లోని కొన్ని పాములు తప్పించుకుపోయాయేమోనని ఇరుగుపొరుగు వారు భయాందోళన వ్యక్తం చేశారు. దీనిపై చార్లెస్ కౌంటీ యానిమల్ కంట్రోల్ ప్రతినిధి...

US Man : మృతదేహం చుట్టూ 125 పాములు, 14 అడుగుల కొండచిలువ కూడా

Snakes

US man Found Dead : అమెరికాలోని మేరీలాండ్‌లో గగుర్పాటుకు గురిచేసే ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మృతదేహం చుట్టూ 125 పాములు పాకుతూ కనిపించడం కలకలం రేపింది. చార్లెస్‌ కౌంటీ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అయితే సదరు వ్యక్తి మృతదేహం కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టే 125 పాములు పాకుతూ కనిపించాయి.

Read More : Ind Vs SA : డికాక్ సెంచరీ, భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా

అందులో అత్యంత విషపూరితమైన కోబ్రాలతోపాటు, 14 అడుగుల ఓ కొండచిలువ కూడా ఉంది. ఆ సర్పాలను అతడు పెంచుకుంటున్నట్లు సమాచారం. ఇతర సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అతడి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. పాములే కాటు వేశాయా.. లేకపోతే ఎవరైనా కుట్రచేసి చంపేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Read More : Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్!

ఇటు ఆ ఇంట్లోని కొన్ని పాములు తప్పించుకుపోయాయేమోనని ఇరుగుపొరుగు వారు భయాందోళన వ్యక్తం చేశారు. దీనిపై చార్లెస్ కౌంటీ యానిమల్ కంట్రోల్ ప్రతినిధి జెన్నిఫర్‌ హారిస్‌ స్పందించారు. ఇంట్లోని సర్పాల్లో ఏవి కూడా తప్పించుకుపోయే అవకాశం లేదని, అన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని స్పష్టం చేశారు. ప్రజలు బయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.