బలాన్నిచ్చిన భార్య మాటలు..కరోనాతో కోమాలోకి వెళ్లాల్సిన వాడు కోలుకున్నాడు

బలాన్నిచ్చిన భార్య మాటలు..కరోనాతో కోమాలోకి వెళ్లాల్సిన వాడు కోలుకున్నాడు

US Man says wife’s voice helped ‘I swear I heard her’ : ప్రతీ మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. ఈ మాట ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఓ మహిళ తల్లీగా, చెల్లిగా,భార్యగా, శ్రేయోభిలాషిగా మగాడికి మానసిక బలాన్నిస్తుంది. ముఖ్యంగా భర్తలకు భార్యలే బలం, బలహీనతా కూడా. ‘‘నువ్వు సాధిస్తావ్..ధైర్యంగా ముందుకెళ్లు’’అని ఒక్కమాట అంటే చాలు ఆ భర్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తాడు.

అదే భార్య ‘‘హా..నువ్వే చేస్తావ్..చేతకానివాడివి’’అని అంటే..ఎంతో సాధించిన భర్త కూడా బేజారెత్తిపోతాడు. తానెందుకు పనికిరాడేమోనని డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. అందుకే భార్యే భర్తకు బలం బలహీనత కూడా..ఆ మాట అక్షరాల నిరూపించిందో భార్య. కరోనా సోకి మానసిక ఆందోళనకు గురైపోయి కోమాలోకి వెళ్లిపోయే ఓ భర్త తన భార్య ఇచ్చిన మాటల బలంతో కోలుకున్నాడు. ఈ అద్భుత ఘటన అమెరికాలోని సౌత్ కరోలినాలో జరిగింది.

అమెరికాలోని సౌత్ కరోలినాలో 43 ఏళ్ల డాన్ గిల్‌మర్, భార్య లాసీతో కలిసి నివశిస్తున్నారు. గిల్ మర్ 10 ఏళ్ల వయస్సునుంచి డ్రమ్స్ వాయించేవాడు. కానీ భార్య అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. దీంతో వారు సన్నిహతంగా ఉండేవాడుకాదు. కానీ లాసీ మాత్రం భర్త అంటే ప్రేమగానే ఉండేది. అతను సంతోషంగా ఉండాలని కోరుకునేది. ఈక్రమంలో గత జూలైలో గిల్‌మర్‌కు కరోనా మహమ్మారి సోకింది. తరువాత కొంత కాలం హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. కానీ దగ్గు ఎక్కువకావడంతో నిద్రే కరువైపోయింది అతనికి. దీంతో హాస్పిటల్ లో చేరితే మంచిదని భార్య చెప్పింది. కానీ పెద్దగా పట్టించుకోకపోయినా తన పరిస్థితి బాగా లేకపోవటంతో హాస్పిటల్ లో ఉండటానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని బాన్ సెకార్స్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో చేరాడు గిల్ మర్.

అలా 63 రోజులు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. కానీ ట్రీట్ మెంట్ ఖర్చులకోసం ఆస్పత్రి బిల్లులు కట్టడం కష్టమైపోయింది. దీంతో సోషల్ మీడియాలో దయచేసి మాకు సహాయం చేయండి అంటూ అర్థించటంతో విరాళాలు బాగానే వచ్చాయి. వాటితో ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలో గిల్‌మర్‌కు జ్వరం ఒక్కసారిగా వచ్చిపడింది. కంట్రోల్ కాలేదు. ఓ పక్క ఆందోళన మరోపక్క తీవ్ర జ్వరంతో కంగారుపడిపోయాడు. దీంతో బీపీ కూడా పెరిగిపోయింది.

గిల్ మర్ కు ఫీవర్ 104 కు పెరిగిపోవటంతో డాక్టర్లు కూడా ఆందోళనపడ్డారు. గిల్‌మర్‌..మీకేమీ కాదు ధైర్యంగా ఉండండీ అని డాక్టర్లు..వైద్య సిబ్బంది చెప్పినా అతని ఆందోళన తగ్గలేదు. దీంతో మరో దారికి లేక అతన్ని వైద్య విధానంలో కోమాలోకి పంపడం తప్ప వేరే మార్గం లేదని..అలా చేయకపోతే గిల్ మర్ ప్రాణాలకు చాలా ప్రమాదమని డాక్టర్లు చెప్పారు.

అలా అతన్ని కోమాలోకి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందని డాక్టర్లు గిల్ మర్ భార్య కు చెప్పారు. ఆరోజు రాత్రి ట్రీట్‌మెంట్‌కు గిల్‌మర్ శరీరం ఎలా రెస్సాండ్ అవుతుందో చూస్తేగానీ అతని పరిస్థితి ఏంటనేది చెప్పలేమని పరిస్థితి ఉందని తెలిపారు. అటువంటి క్లిష్ట సమయంలో గిల్‌మర్ భార్య.. అతని పక్కనే కూర్చొని ‘‘నీకేం కాదు. నిన్ను డాక్టర్లు చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు త్వరగా కోలుకుంటావు..త్వరగా ఇంటికి వచ్చేస్తావు..


ఆ తరువాత నీకు నచ్చిన పని చేస్తావు’’ అంటూ ధైర్యం చెప్పింది. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా నుంచి కోలుకున్నాడు గిల్‌మర్.. ఆ రాత్రి తన భార్య చెప్పిన మాటలు తనకు వినిపించాయని ఆ మాటలు తనకెంతో ధైర్యాన్నిచ్చాయని ఆమె నిజంగా ‘సూపర్ ఉమెన్’అని చెబుతున్నాడు.


‘‘నిజంగా చెప్తున్నా.. ఆరోజు ఆమె మాట్లాడిన మాటలు నాకు వినిపించాయి. ఆమె నా దేవత. నేను కోలుకొని ఇప్పుడు మీ ముందు ఉన్నానంటే దానికి తనే కారణం’’ అంటూ తన భార్యకు ధన్యవాదాలు చెప్తున్నాడు గిల్‌మర్. ‘‘ఈ రాత్రి గడిస్తేగానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అన్న రోజు.. తను ఎలా గడిపిందో నాకు తెలీదు. కానీ నేనైతే అంత ధైర్యంగా ఉండగలననే నమ్మకం నాకు లేదు. అందుకే తను నా దేవత’’ అని గిల్‌మర్ అంటున్నాడు. ఇకనుంచి తన భార్యే తనకు సరస్వమని ఇకనుంచి ఇద్దరం హాయిగా జీవిస్తామని ఇక ఎప్పుడు ఆమెను విడిచిపెట్టి ఉండలేనని చెబుతున్నాడు గిల్ మర్. నా భార్య లూసీ లేకుంటే ఈరోజు నేను లేను..ఇకనుంచి కూడా అంతే ఆమె లేనిదే నేను లేను అని ఉద్వేగంగా చెబుతున్నాడు.

లూసీ తన దగ్గర కూర్చుని జాగ్రత్తలు చెబుతున్నప్పుడు డాక్టర్లు వారించారనీ..మీకు కూడా కరోనా సోకుందని చెప్పారనీ కానీ లూసీ ఏమాత్రం పట్టించుకోకుండా తన పక్కనే కూర్చుని ధైర్యం చెప్పిందని ఆ మాటలే నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయని చెబుతున్నాడు తన 43 ఏళ్లలో ఒక్కసారికూడా హాస్పిటల్ కు రానీ డాన్ గిల్మర్. కానీ కరోనా సోకాక డాన్ గిల్మర్ మొత్తం 63 రోజుల పాటు హాస్పిటల్ లో ఉన్నాడు.

కరోనా నుంచి కోలుకున్న తరువాత గిల్మర్ తన రియల్ స్టోరీని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. తను కోలుకోవడానికి భార్యే కారణమని అతను చెప్పడమే. భార్యాభర్తల మధ్య ప్రేమ నిజంగా మనుషుల్ని బ్రతికిస్తుందని, దానికి తన కథే నిదర్శనమని చెప్తున్న డాన్ గిల్‌మర్..