Face book‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్ యాక్సెప్ట్‌ చేయకపోతే చంపేస్తా..బాసుకు బెదిరింపులు, వేధింపులు

Face book‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్ యాక్సెప్ట్‌ చేయకపోతే చంపేస్తా..బాసుకు బెదిరింపులు, వేధింపులు

US man threatens kill ex boss ignoring his friend request : ఒరేయ్..నా ఫ్రెండ్ జోలికొస్తే చంపేస్తాననే స్నేహితుల్ని చూశాం. కానీ ఓ సోషల్ మీడియా పిచ్చోడు మాత్రం ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి..‘నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తా’నంటూ థమ్కీ ఇచ్చాడు.’నా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ఓకే చెయ్‌, లేదంటే నిన్ను చంపడానికి క్కూడా వెనుకాడను జాగ్రత్త అంటూ బెదిరించిన ఘటన యూఎస్ లోని ఉత్తర డకోటాలో జరిగింది.

USలోని ఉత్తర డకోటాకు చెందిన 29 ఏళ్ల కలేబ్‌ బర్క్‌జిక్..‌ తన మాజీ బాస్‌కు డిసెంబర్‌ 24న ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. కానీ అతడు పనిలో పడి మర్చిపోయాడో ..లేదా ఇష్టం లేక యాక్సెప్ట్ చేయలేదో గానీ కలేబ్ బర్క్ జిక్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయలేదు.

రెండు రోజులు గడిచినా తన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయకపోవటంతో కలేబ్ కు ఇగో హర్ట్ అయ్యింది. తనను రిజక్ట్ చేసినంతగా ఫీలైపోయి సహించలేకపోయాడు. దీంతో సదరు మాజీ బాస్ పై బెదిరింపులకు దిగాడు. ‘నా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ఓకే చెయ్‌, లేదంటే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను’ అంటూ బెదిరించాడు.

ఆ మాజీ మాత్రం తక్కువ తినలేదు. ఏంది నీ బెదిరింపులు బెదిరించి ఫ్రెండువి అవుతావా అన్నట్లుగా కావాలనే కలేబ్‌ను ఫ్రెండ్‌ గా యాక్సెప్ట్ చేయలేదు. దీన్ని అస్సలు సహించలేకపోయాడు కలేబ్‌. వెంటనే దీనికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆవేశంగా మాజీ బాస్ ఇంటికెళ్లాడు.

అలా వెళ్లటం వెళటమే ఇంటి తలుపుని ధడేలుమని తన్ని లోపలికెళ్లి మళ్లీ అదే రేంజ్ లో బెదిరించాడు. దీన్ని కూడా సదరు మాజీ బాస్ లెక్కచేయలేదు. ఏం చేసుకుంటావో చేస్కో ఫో..అన్నారు. దీంతో కలేబ్ మరింతగా రెచ్చిపోయాడు. స్నాప్‌చాట్‌ వంటి పలు సోషల్‌ మీడియాల్లోనూ మాజీ బాస్ ను పలు విధాలుగా దూషించాడు. పలువిధాలుగా వేధింపులకు గురి చేశాడు.

దీంతో సహనం నశించిన అతను వీడినిలా వదిలేస్తే లాభం లేదనుకుని..పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలేబ్ తన ఇంటికొచ్చి బెదిరించిన ఆధారాలన్ని పోలీసులకు సమర్పించాడు. వారు బర్క్‌జిక్‌ను అదుపులోకి తీసుకుని బెదిరింపులు, భయపెట్టటం వంటి పలు కేసుల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కలేబ్ ను జనవరి 27,2021న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ కేసుపై విచారించి కోర్టు కలేబ్ కు ఏ శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.