Mass shooting: అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం.. ప‌లువురి మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. ఈశాన్య వాషింగ్ట‌న్‌లోని ఎఫ్ స్ట్రీట్ 1500 బ్లాక్‌లో జ‌నాల‌పై ఓ దుండగుడు కాల్పులకు తెగ‌బ‌డ‌డంతో కొంద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని, మ‌రికొంద‌రికి గాయాల‌య్యాయ‌ని అధికారులు తెలిపారు. మృతులు/క్ష‌త‌గాత్రుల వివ‌రాల‌ను వారు తెల‌ప‌లేదు

Mass shooting: అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం.. ప‌లువురి మృతి

Mass shooting: అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. ఈశాన్య వాషింగ్ట‌న్‌లోని ఎఫ్ స్ట్రీట్ 1500 బ్లాక్‌లో జ‌నాల‌పై ఓ దుండగుడు కాల్పులకు తెగ‌బ‌డ‌డంతో కొంద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని, మ‌రికొంద‌రికి గాయాల‌య్యాయ‌ని అధికారులు తెలిపారు. మృతులు/క్ష‌త‌గాత్రుల వివ‌రాల‌ను వారు తెల‌ప‌లేదు. అలాగే, కాల్పులు జ‌రిపిన నిందితుడి వివ‌రాల‌ను కూడా అధికారులు చెప్ప‌లేదు. కాల్పుల ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

గ‌త రాత్రి దుండ‌గుడు దాదాపు 15 రౌండ్ల కాల్పులు జ‌రిపాడ‌ని స్థానికులు మీడియాకు తెలిపారు. కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ వ్య‌క్తి గురించి పోలీసులు గాలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆ వ్య‌క్తి ఎందుకు కాల్పులు జరిపాడ‌న్న వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. అమెరికాలో ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 300కు పైగా కాల్పుల ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ప‌దే ప‌దే కాల్పుల ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేప‌ట్టిన తైవాన్