రెండు దేశాల మధ్య ఇనుప గోడ : ‘పింక్’ తూగుడు బల్లలకు డిజైన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు

రెండు దేశాల మధ్య ఇనుప గోడ : ‘పింక్’ తూగుడు బల్లలకు డిజైన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు

US-Mexico border: Pink seesaws Design of the Year 2020 : పార్కులకు వెళితే..చిన్నారులు తూగుడు బల్లల ఆట ఆడటానికి రెడీ అయిపోతారు. ఇద్దరు చిన్నారులు చెరోవైపునా కూర్చునీ కిందకూ..పైకీ ఆడే ఆటంటే చిన్నారులు చాలా ఇష్టపడుతుంటారు. అటువంటి తూగుడు బల్లల ఆటకు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి..అవార్డులు వచ్చి పడుతున్నాయి. రెండు దేశాల మధ్య నిర్మించిన ఇనుప గోడకు అమర్చిన ‘పింక్ కలర్’తూడుగు బల్లలపై రెండు దేశాల చిన్నారులు ఆడుతున్న ఆటలకు ప్రపంచమే ఫిదా అవుతోంది. ఈ ‘పింక్ కలర్’ తూడుగు బల్లల ఆటలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అదేంటీ?! చిన్న పిల్లలు ఆడుకునే తూగుడు బల్లలకు ఈ ఆటకు అంత స్పెషలేంటంటే..ఒకే తూగుడు బల్లపై రెండు దేశాల పిల్లలు ఊగుతు ఆడుకోవటమే పెద్ద విశేషం..!!

 

అమెరికా, మెక్సికో దేశాలమధ్య నిర్మిచిన ఇనుప గోడకు మూడు ‘పింక్ కలర్’తూడుగు బల్లలు ఏర్పాటు చేశారు. అలా ఆ రెండు దేశాల మధ్య పెట్టిన గులాబీ రంగు తూగుడు బల్లల వద్ద ఏం జరుగుతోందో చూశాక అంతా ఫిదా అవుతున్నారు. ఈ ఆటకు యునైటెడ్ కింగ్ డమ్ ప్రభు్త్వం ఏకంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డునే ఇచ్చేసిందీ అంటే అవి ఎంత ప్రత్యేకమైనవో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..

 

 

అమెరికా, మెక్సికో దేశాల మధ్య ఎటువంటి పరిస్థితులు ఉండేవో అందరికీ తెలిసిందే. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనే కాదు..అంతకుముందున్న ఒబామా హయాంలో కూడా మెక్సికో నుంచి అక్రమ వలసలను నియంత్రించేందుకు ఎన్నో యత్నాలు జరిగాయి. కానీ వలసలు మాత్రం ఆగేవికాదు. దీంతో డొనాల్డ్ ట్రంప్ పాలన హయాంలో ఏకంగా యూఎస్-మెక్సికో దేశాల మధ్య ఏకంగా ఇనుప గోడే కట్టించేశారు.

ఈ క్రమంలో 2019వ సంవత్సరం జూలై 28న అమెరికా-మెక్సికో దేశాల మధ్య ఏర్పాటు చేసిన ఇనుప గోడల మధ్యల్లో మూడు ‘గులాబీ రంగు తూగుడు బల్లలు’ వెలిశాయి. ఈ తూగుడు బల్లలపై ఇవతలి వైపు అమెరికన్ పిల్లలు..అవతలి వైపు మెక్సికన్ పిల్లలు ఊగుతూ సరదాగా సరదాగా ఆడుకోవటం మొదలు పెట్టారు. అలా ఆ ఏరియా అంతా పిల్లలతో సందడి సందడిగా మారిపోయింది. చిన్నారులే కాకుండా ఈ తూగుడు బల్లలపై పెద్దవాళ్లు కూడా ఊగుతు ఆటుకుంటుంటారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో అది ఇప్పటీకీ ప్రపంచ దేశాల ప్రజలను ఫిదా చేస్తూనే ఉంది. ట్రంప్ ప్రభుత్వం రాజకీయ వైఖరితో అలా ఏర్పాటు చేసిన తూగుడు బల్లల్ని కేవలం అరగంటలో తీసేయాల్సి వచ్చింది. కానీ..రెండు దేశాల మధ్య ఏర్పాటు చేసిన తూగుడు బల్లల వీడియో మాత్రం ఇప్పటికీ ప్రజలు చాలా ఇష్టంగా చూస్తుంటారు. వైరల్ చేస్తుంటారు. ’రాజకీయ నేతల మధ్య విబేధాలు రావచ్చు..అవి పోవచ్చు కూడా. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరు. అది స్వదేశంలో అయినా విదేశంతో అయినా సరే.

కానీ ఈ రాజకీయాలకు చిన్నారులు అతీతులు.వారికి ఇవేమీ తెలియవు. వాళ్లు ఆడుకునే పిల్లలు ఏదేశం వారా అనేది వాళ్లకు అనవసరం. ఎందుకంటే చిన్నారులకు మాయా మర్మం తెలీదు. అందుకే చిన్న పిల్లలు మాత్రం ఎప్పుడూ ఐకమత్యంతో ఉంటారు‘ అన్న కామెంట్స్ నెట్టింట వెల్లువెత్తాయి. దీంతో ఈ ప్రాజెక్టు యూకేలో డిజైన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డుకు ఎంపికయింది.

ప్రపంచ వ్యాప్తంగా 74 ప్రాజెక్టులు ఈ అవార్డు పరిశీలనలోకి రాగా..అమెరికా మెక్సికో దేశాల మధ్య ఏర్పాటయిన ఈ తూగుడు బల్లల ప్రాజెక్టుకు మాత్రం అంతా ఫిదా అయ్యారు. ప్రపంచమే ఫిదా అయ్యింది. రెండు జాతుల మధ్య సత్సంబంధాలను పెంచే వారథిలా అది కనిపించిందని ఈ సందర్భంగా అవార్డు సభ్యులు వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాకు చెందిన రోనాల్డ్ రాయెల్, వర్జీనియా శాన్ ప్రాటెల్లో సంయుక్తంగా కలెక్టివో చోపెక్ అనే ఆర్టిస్ట్ సహకారంతో ఈ గులాబీ రంగు తూగుడు బల్లల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.