Teeth Loss : బరువు తగ్గటానికి సర్జరీ..33 ఏళ్ల మహిళ 32 పళ్లు ఊడిపోయాయ్..!

రువు తగ్గించుకోవటానికి సర్జరీ చేయించుకున్న ఓ మహిళ భారీగానే తగ్గింది. కానీ పళ్లన్నీ ఊడిపోయి కట్టుడు పళ్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Teeth Loss : బరువు తగ్గటానికి సర్జరీ..33 ఏళ్ల మహిళ 32 పళ్లు ఊడిపోయాయ్..!

Woman Facing Teeth Complications After Gastric Bypass.. (2)

US woman facing teeth loss : లావుగా ఉన్న చాలామంది సన్నగా నాజూగ్గా ఉండాలని ఆశపడుతుంటారు. లావు అయితే ఓకే కానీ మరీ అధిక బరువు అంటేకాస్త కష్టమే. ఇలా కొంతమంది అధిక బరువు తగ్గించుకోవటానికి ఆపరేషన్లు చేయించుకుంటారు. కానీ ఈ సర్జరీలు అన్నీ సక్సెస్ కాకపోవటంతో కొంతమంది బాధితులవుతున్నారు. ఈక్రమంలో వారికి రకరకాల సైడ్ఎఫెక్టులతో ఒక్కొకరూ ఒక్కో రకమైన ఇబ్బందులకు గురైన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈక్రమంలో ఓ యువతి అధిక బరువు తగ్గించుకోవటానికి సర్జరీ చేయించుకుని పళ్ల డాక్టర్ దగ్గరకు తిరగాల్సి వస్తోంది. సర్జరీతో సైడ్ ఎఫెక్టులు వచ్చి పళ్లు (దంతాల) అన్నీ ఊడిపోయి పళ్ల డాక్టర్ దగ్గరకు తిరగాల్సి వచ్చింది.

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన కాథీ బ్లేతీ అనే 33 మహిళ పరిస్థితి ఇది. అధిక బరువు తగ్గించుకోవటానికి సర్జరీ చేయించుకుంది. బరువు కూడా భారీగానే తగ్గింది. అలా ఏకంగా 57 కిలోల బరువు తగ్గింది. కానీ మరో సమస్య వచ్చి పడింది. కాథీ బ్లేతీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కాథీ బ్లేతీకి ఇప్పుడు అనే 33 ఏళ్లు.అధిక బరువుతో బాధపడుతున్న ఆమె తన 22 ఏళ్ల వయసులో అంటే 2011లో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకుంది. ఫలితంగా 57 కిలోల బరువు తగ్గింది. సర్జరీ జరిగిన రెండేళ్ల వరకు ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అంతా బాగానే ఉంది. కానీ ఆమెకు 24 ఏళ్ల వయసులో దంత సమస్యలు రావడం మొదలయ్యాయి. దంతాలు పటుత్వాన్ని కోల్పోయి ఒక్కొక్కటిగా ఊడిపోవడం మొదలయ్యాయి. అలా ఆమె 32 దంతాలు ఊడిపోయాయి. ఒక్కో దంతం ఊడిపోవడం..ఆమె టీత్ స్పెషలిస్టులను కలవటం..పన్నును పెట్టించుకోవడం అలా పన్ను ఊడినప్పుడల్లా ఆమెకు అదే పనిగా మారింది. అలా ‘ఎనిమిదేళ్లకుపైగా దంతాలుకట్టించుకోవటమే సరిపోయింది.

దీనిపై కేథీ బ్లేతీ మాట్లాడుతూ..8 ఏళ్లకు పైగా నా దంతాలను కాపాడుకోవటానికే ఎంతో డబ్బు ఖర్చు చేశా. సర్జరీకి ముందు నాకు ఎటువంటి దంత సమస్యలు లేవు. సర్జరీ తర్వాతే ఈ సమస్య మొదలయింది. చివరకు పళ్లు (కృత్రిమ దంతాల)కట్టించుకోవాల్సి వచ్చింది అంటూ వాపోయింది. కేథీ తన అనుభవం గురించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సో..అధిక బరువు తగ్గించుకోవటానికి సర్జరీ చేయించుకునేవారు ఒకటికి పదిసార్లు నిపుణులను సంప్రదించి చేయించుకోవాలా?వద్దా? అనేది నిర్ణయించుకోవాల్సి ఉంది.