47ఏళ్ల బంధం..చావులోనూ వీడలేదు..కరోనాతో ఒకేసారి భార్యాభర్తలు మృతి

  • Published By: nagamani ,Published On : December 5, 2020 / 12:13 PM IST
47ఏళ్ల బంధం..చావులోనూ వీడలేదు..కరోనాతో ఒకేసారి భార్యాభర్తలు మృతి

US : michigan couple married for 47 years die of corona : కష్టంలోను..సుఖంలోనే కలిసి మెలిసి ఉన్న భార్యాభార్తల్ని కరోనా కాటువేసింది. 47 సంవత్సరాల వివాహ బంధంలో ఎన్నో చూసిన ఆ భార్యాభర్తలు ఒకేసారి కరోనా మహమ్మరికి బలైపోయింది. యూఎస్ ఏలోని మిచిగాన్ లో కరోనాతో వృద్ధ దంపతులు ఒకే సమయంలో చనిపోయిన సంఘటన చికిత్స చేసిన డాక్టర్లకు సైతం కన్నీరు పెట్టించింది.



వివరాల్లోకి వెళితే..మిచిగాన్‌కు చెందిన ప్యాట్రిసియా, లెస్లీ మెక్‌వాటర్స్ భార్యాభర్తలు. 47 సంవత్సరాలు కష్టసుఖాల్లో కలిసి గడిపారు.పిల్లలు, మనమలు, మునిమనవళ్లను కూడా ఎత్తుకున్నారు. ఎంతో సంతోషంగా గడిచిపోతున్న వారి జీవితాల్లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనా సోకిన వీరిద్దరూ చికిత్స పొందుతూ గతవారం ఒకేరోజు ఒకే సమయంలో ప్రాణాలు వదిలారు. దీంతో వారి పిల్లలు..మనుమలు..మునిమనుమరాళ్లంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. డాక్టర్లు కూడా కంటతడిపెట్టారు.



అమ్మానాన్నలిద్దరూ ఒకేసారి చనిపోవటంతో వారి పిల్లలు మాట్లాడుతూ..‘‘మా అమ్మానాన్నలు ప్రతీ పనినీ కలిసే చేసేవారు…ఎప్పుడూ ఇద్దరిదీ ఒకే మాట. ఒకేబాట అన్నట్లుగా ఉండేవారు. వారిని చూసి మేం చాలా సంతోషించేవాళ్లం..వాళ్లలా జీవించాలని అనుకునేవాళ్లం. అలా ఏకష్టం విడదీయలేని వారిని కరోనా కూడా విడదీయలేకపోయింది. కరోనాతో పోరాడి పోరాడి అలసిపోయి.. చావులో కూడా ఒకరికి ఒకరు విడచిపెట్టలేదు. కరోనా భూతం కూడా వారిని దూరం చేయలేకపోయిందని..కోలుకుంటారని ఎంతగానో ఎదురు చూశాం కానీ ఇద్దరూ ఒకేసారి చనిపోయాని తెలిసి షాక్ అయ్యాం” అని కూతురు జోన్నా సిస్క్ తెలిపారు.



“మా అమ్మ ప్యాట్రిసియా, నాన్న మెక్‌వాటర్స్ చాలా అన్యోన్యంగా జీవించేవారు. ప్రతీ ఒక్కరినీ గౌరవించేవారు. అందరినీ ప్రేమగా చూసేవారు. ఇద్దరూ కలిసి జీవితాన్ని చాలా ఎంజాయ్ చేశారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. పార్టీలకు, ఫ్యామిలీ ఈవెంట్లకు చాలా ఉత్సాహంగా వెళ్లేవారు..” అని సిస్క్ తెలిపారు. ఈక్రమంలో అమ్మానాన్నలిద్దరికీ ఒకేసారి కనోనా సోకింది. టెస్ట్ లు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇద్దరూ కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్య రంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న అమ్మకు వారి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసు. దీంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కరోనాతోనే ఇద్దరూ ఒకేసారి చనిపోయరని తెలిపారు.



 

ప్యాట్రిసియా, లెస్లీ మెక్‌వాటర్స్ లు భిన్నవైన రంగాల్లో పనిచేసేవారు. ప్యాట్రిసియా నర్సుగా పనిచేసి రిటైర్ అవ్వగా..మెక్‌వాటర్స్ ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.ఐసోలేషన్ లోనే ఉన్నా ఎంతకూ వైరస్ తగ్గక పోవడంతో వారం రోజుల తరువాత హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వారం రోజులు ట్రీట్‌మెంట్ ఇచ్చినా మెరుగుపడలేదు. ప్యాట్రిసియా ఆరోగ్యం క్షీణిస్తోందని డాక్టర్లు చెప్పారు. శ్వాస కూడా డౌన్ అయిపోతోందనీ కూతురు సిస్క్ కు చెప్పారు. వేరే గదిలో చికిత్స అందిస్తున్న తన తండ్రి ఆరోగ్యం కూడా అదే పరిస్థితి. క్రమంగా క్షీణిస్తోందని..వెళ్లి ఒకసారి చూడమని సిస్క్‌తో చెప్పారు.



‘‘మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని డాక్టర్లు చెప్పారు. కానీ.. అప్పటికి నాన్న బాగానే ఉన్నారు. అమ్మను దగ్గర నుంచి నాన్న దగ్గరికి వెళ్లాను. అలా తాను దగ్గర ఉండగానే తండ్రి ప్రాణాలు విడిచారని..సరిగ్గా అదే సమయంలో అమ్మ కూడా చనిపోయిందని డాక్టర్లు చెప్పారని ఇది నిజంగా షాక్ కు గురిచేసే ఘటన అని..చావులో కూడా వారిద్దరూ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదని కూతరు సిక్క్ కన్నీటితో చెప్పింది. సరిగ్గా సాయంత్రం 4:23 గంటలకు చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు.