‘Alien Coin’ : వైరల్ అవుతున్న ‘ఏలియ‌న్ నాణెం’..గ్రహాంతరవాసుల కరెన్సీయా?!

ఇప్పటి వరకు ఎన్నో దేశాలకు చెందిన కరెన్సీ నాణాలను చూసి ఉంటారు. కానీ గ్రహాంతరవాసుల కరెన్సీ చూశారా? అటువంటి ఏలియన్స్ నాణెం వైరల్ గా మారింది..

‘Alien Coin’ : వైరల్ అవుతున్న ‘ఏలియ‌న్ నాణెం’..గ్రహాంతరవాసుల కరెన్సీయా?!

Us Michigan Man Finds A Rare ‘alien Coin’

‘Alien Coin’ : ఇప్పటి వరకు ఎన్నో దేశాలకు చెందిన కరెన్సీ నాణాలను చూసి ఉంటారు. కానీ గ్రహాంతరవాసుల కరెన్సీ చూశారా? అదేనండీ ‘ఏలియన్స్ కరెన్సీ’ చూశారా? అసలు ఏలియన్స్ ఉన్నారో లేదో అనే విషయంపైనే ఇంకా శాస్త్రవేత్తలు క్లారిటీ ఇవ్వలేదు..దానికి సంబంధించిన ఆధారాలే లేవు. కానీ ఏలియన్స్ కరెన్సీ చూశారా? అని అంటున్నారేమిటా అని అనుకోవచ్చు. కానీ ఇటీవల ఓ వ్యక్తికి లభ్యమైన ఓ నాణెం మాత్రం అది ఏలియన్స్ కరెన్సీయా? అనేలా ఉంది. ఆ నాణెం మీద ఏలియన్ బొమ్మ ఉంది. అందుకే దాన్ని ఏలియన్స్ నాణెం అంటున్నారు. ఈ నాణెం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ తెగ వైరల్ అయిపోతోంది.

మ‌న భూమికి ఆవ‌ల ఏదో ఒక‌ గ్ర‌హంపై ఏలియ‌న్స్ ఉన్నార‌ని చాలామంది న‌మ్ముతుంటారు. ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తునే ఉన్నారు. కానీ ఏలియిన్స్ ఉన్నారనే విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ రావటంలేదు. ఈక్రమంలో ఇంట‌ర్నెట్‌లో ప్ర‌స్తుతం ఓ ఏలియ‌న్ నాణెం చ‌క్క‌ర్లు కొడుతోంది. త‌న‌కు దొరికిన నాణెంపై ఏలియ‌న్ బొమ్మ ఉండ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయిన వ్య‌క్తి దాని ఫొటోను సోష‌ల్‌మీడియాలో పెట్టాడు.

అమెరికాలోని మిచ్ గాన్ లో జోర్డాన్ అనే వ్య‌క్తికి క్వార్టర్స్ రోల్‌లో ఈ అసాధార‌ణ‌మై నాణెం (‘Alien Coin’)దొరికింది. దానికి ఒక‌వైపు గ్రహాంతరవాసి తల ముద్రించి ఉంది. ఈ కాయిన్ ఫొటోను జోర్డాన్ త‌న రెడ్డిట్ అకౌంట్‌లో షేర్ చేశాడు. దీన్ని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.

ఈ కాయిన్‌ను చివ‌ర‌గా హోబో నికెల్స్ అని నిపుణులు తేల్చారు. ఈ హోబో నికెల్స్ యూఎస్‌లో 20వ శ‌తాబ్దం ప్రారంభంలో ప్ర‌సిద్ధి చెందాయి. ఆ సమయంలో నిరాశ్రయులైన వ్యక్తులు కత్తులు, ఇతర సాధనాలను ఉపయోగించి వారు సొంతంగా నాణేల‌ను త‌యారుచేసుకున్నారు. వాటిని హోబో నికెల్స్ అని పిలుస్తారు. చిన్న విలువలతో కూడిన ఈ నాణేలను వారు వాడేవారు. 1913 నుంచి 1980 వరకు దాదాపు 2,00,000 క్లాసిక్ హోబో నికెల్‌లు చ‌లామ‌ణి అయిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు.