US Aquarium : మూడు తిమింగలాలకు పేర్లు పెట్టడానికి వేలం

యూఎస్ ఒక అక్వేరియం ఓ వింత నిర్ణయం తీసుకుంది. కెనాడాలో ఉండే మూడు తిమింగిలాలను యూఎస్ లోని న్యూయార్క్ తీసుకురావాలని నిర్ణయించుకుంది. అంతేకాదు వాటికి పేర్లు పెట్టానికి ఓ వేలాన్ని నిర్వహించాలను నిర్ణయించింది. ఈ తిమింగిలాలకు పేర్లు పెట్టటానికి వేలం నిర్వహించాలని భావించింది.

US Aquarium : మూడు తిమింగలాలకు పేర్లు పెట్టడానికి వేలం

Aquarium Auctions The Chance To Name 3 Whales

Aquarium auctions the chance to name 3 whales : సాధారణంగా అక్వేరియంలో చిన్న చిన్న అందమైన చేపలు ఉంటాయి. గోల్డ్ ఫిష్ లాంటి అందంగా కనిపించే చేపల్ని అక్వేరియంలో పెంచుకుంటారనే విషయం తెలిసిందే. కాస్త పెద్ద అక్వేరియం అయితే ఇంకొంచెం పెద్ద చేపలుంటాయి. కానీ భారీ సైజులో ఉండే తిమింగిలాలను అక్వేరియంలో పెట్టాలంటే చాలా పెద్ద అక్వేరియం కావాలి కదూ..అందుకే డాల్పిన్లు, తిమింగలాల వంటివాటిని పెద్ద పూల్ లాంటివాటిలో పెంచుతారు. ఇదిలా ఉంటే యూఎస్ ఒక అక్వేరియం ఓ వింత నిర్ణయం తీసుకుంది.

కెనాడాలో ఉండే మూడు తిమింగిలాలను యూఎస్ లోని న్యూయార్క్ తీసుకురావాలని నిర్ణయించుకుంది. అంతేకాదు వాటికి పేర్లు పెట్టాడానికి ఓ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. బెలుగా జాతికి చెందిన మూడు తిమింగలాలను యూఎస్ అక్వేరియానికి తీసుకురావాలని నిర్ణయించారు సీ రీసెర్చ్ ఫౌండేషన్‌లో భాగమైన మిస్టిక్ అక్వేరియం నిర్వహకులు.

అంతేకాదు ఈ మూడు తిమింగలాలకు పేర్లు పెట్టే ఛాన్స్‌ను వేలం వేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మూడు తిమింగిలాలు ప్రస్తుతం కెనడాలో ఉండగా వాటిని అమెరికాకు తీసుకురావడానికి అయ్యే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చును సేకరించడం కోసమే అక్వేరియం నిర్వాహకులు పేర్ల కోసం వేలం నిర్వహించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేలం ద్వారా కనీసం 4 మిలియన్ డాలర్లు సేకరించాలని అక్వేరియం నిర్వాహకులు అంచనావేస్తున్నారు. ఈ వేలంలో ఒక బోటుతో పాటు వింటేజ్ కారు కూడా ఉంటాయట.

ఈ వేలం గురించి అక్వేరియం అధ్యక్షుడు..సీఈవో స్టీఫెన్ కోన్ మాట్లాడుతూ..తిమింగిలాలకు పేర్లు పెట్టడానికి మేం కొన్ని పేర్లు సూచిస్తాం..వాటిని వేలానికి వచ్చినవారు సెలక్ట్ చేస్తారని తెలిపారు. కాగా..చాలామంది జంతువులకు..పలు ప్రాణులకు పేర్లు పెట్టటానికి ఉత్సాహపడతారని అలా ఉత్సాహంతో వచ్చినవారు సెలక్ట్ చేసిన పేర్లు తిమింగిలాలకు పెడతామని తెలిపారు. ఈ వేలాన్ని ఆగస్టు 19న నిర్వహిస్తామని తెలిపారు. బెలూగాస్ సంరక్షణ కోసం ఆక్వేరియంకు సంవత్సరానికి 5 మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతాయని..గతంలో కూడా మేం కొన్ని జంతువులకు పేర్లు పెట్టామని అప్పుడు కూడా చాలామంది వాటినికి పేర్లు పెట్టటానికి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.