Governor Harassed : మ‌హిళ‌ల‌పై న్యూయార్క్ గ‌వ‌ర్నర్‌ లైంగిక వేధింపులు..రాజీనామా చేయాలని డిమాండ్స్

న్యూయార్క్ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యుమో 10మందికి పైగా మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధింపులకు గురిచేశారని న్యూయార్క్ అటార్నీ జ‌న‌ర‌ల్ లెతితియ జేమ్స్ సంచ‌లన విష‌యాలు వెల్ల‌డించారు. దీంతో ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.

10TV Telugu News

New york governor andrew cuomo sexually harassed multiple women : న్యూయార్క్ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యుమో 10మందికి పైగా మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధింపులకు గురిచేశారని న్యూయార్క్ అటార్నీ జ‌న‌ర‌ల్ లెతితియ జేమ్స్ సంచ‌లన విష‌యాలు వెల్ల‌డించారు. దీంతో ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రూ క్యుమో మ‌హిళ‌ల ప‌ట్ల అమ‌ర్యాద‌క‌రంగా వ్య‌వ‌హ‌రించారని ద‌ర్యాప్తులో వెల్ల‌డ‌వ‌డంతో బాధ్యాయుతమైన, గౌరవప్రదమైన పదివిలో ఉండి ఇటువంటి పనులకు పాల్పడుతున్న గ‌వ‌ర్న‌ర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది. ఆండ్రూ మాజీ రాష్ట్ర ఉద్యోగులను,రాష్ట్ర ప్రభుత్వం వెలుపల ఉన్న అనేక మంది మహిళలను క్యూమో వేధించినట్లు కార్యాలయం దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తుకు సంబంధించిన సుదీర్ఘమైన నివేదికను మంగళవారం (ఆగస్టు 3,2021) విడుదల చేసింది.

ఈ నివేదిక‌లో 11 మంది మ‌హిళ‌ల‌పై ఆయ‌నతో పాటు ఆయ‌న సీనియ‌ర్ సిబ్బంది కూడా లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు స్ప‌ష్ట‌మైంద‌ని అటార్నీ జ‌న‌ర‌ల్ లెతితియ జేమ్స్ తెలిపారు. గవర్నర్ పై వచ్చిన ఆరోపణలపై ఐదు నెల‌ల పాటు దర్యాప్తు చేయగా గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ జాతీయ‌, రాష్ట్ర చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తూ ప‌లువురు మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధించాడ‌ని తేలింద‌ని ఆమె వెల్ల‌డించారు. క్యుమోతో పాటు ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న మ‌హిళా ఉద్యోగుల‌తో పాటు గ‌తంలో ప‌నిచేసిన న్యూయార్క్ స్టేట్ ఉద్యోగినుల‌తో కూడా అసభ్యంగా వ్యవహరిస్తూ..పలు అభ్యంతరకర భాగాల్లో తాక‌డం, వారిని ద్వందార్ధ (డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ) వ్యాఖ్య‌ల‌తో ఇబ్బంది పెట్ట‌ాడని జేమ్స్ తెలిపారు.

తన వేధింపుల‌ను బ‌య‌ట‌పెట్టారనే ఆగ్ర‌హంతో ఆండ్రూ క్య‌మో ఆయ‌న సీనియ‌ర్ సిబ్బంది అటార్నీ జ‌న‌ర‌ల్ లెతితియ జేమ్స్ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని కూడా ద‌ర్యాప్తులో వెల్ల‌డి కావటం విశేషం.లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి గవర్నర్ క్యుమోపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రిప‌బ్లిక‌న్ స‌భ్యురాలు ఎలిస్ స్టెఫానిక్ డిమాండ్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ క్యుమో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని.. ఆయ‌న‌ను వెంటనే అరెస్ట్ చేయాల‌ని జేమ్స్ ట్వీట్ చేశారు.

గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి క్యుమో అనర్హుడని న్యూయార్క్ అసెంబ్లీ స్పీక‌ర్ కార్ల్ హెస్టీ అన్నారు. మ‌రోవైపు త‌న‌పై వ‌చ్చిన లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ క్యుమో ఖండిస్తున్నారు. తాను ఏ మ‌హిళ‌నూ అభ్యంత‌ర‌క‌రంగా తాక‌లేద‌ని, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌లేద‌ని ఇవన్నీ తనపై కుట్రతో తనను అప్రతిష్టపాలు చేయటానికేనని ఆయన అంటున్నారు. తనకు మహిళలంటే ఎంతో గౌవరవం అని చెప్పుకొస్తున్నారు.కాగా గవర్నర్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం 179మంది వ్యక్తులను విచారించారు. 74,000 సాక్ష్యాలను సమీక్షించామని జేమ్స్ తెలిపారు. ఇది ఏదో గుడ్డిగా చేసిన దర్యాప్తు కాదనీ సదరు మహిళలు తీవ్రంగా మనో వేదనకు గురయ్యారని తమ విచారణలో వెల్లడైందని తెలిపారు.

సెప్టెంబర్ 2019 లో న్యూయార్క్ లో గవర్నర్ మాట్లాడుతున్న ఈవెంట్‌లో క్యూమో తన చేతిని, ట్యాప్ చేసి, ఆపై ఆమె పిరుదులను పట్టుకున్నాడని తాను అభ్యంతరం వ్యక్తంచేసినా అతను ఆగలేదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ బాధితురాలు (ఉద్యోగిని) వాపోయిందని జేమ్స్ తెలిపారు. అదే సంవత్సరం మరో సీనియర్ ఉద్యోగినిని ఓ వెడ్డింగ్ ఫంక్షన్ లో అభ్యంతర భాగంలో ముద్దు పెట్టుకున్నాడని..ఆ దృశ్యాలు ఆ పెళ్లిలో తీసిన ఫోటోల్లో కూడా ఉన్నాయని తెలిపారు.

10TV Telugu News