South China Sea : చైనా సముద్రంలో..అమెరికా న్యూక్లియర్ సబ్‌మెరైన్‌కు ప్రమాదం
దక్షిణ చైనా సముద్రంలో మరో అలజడి రేగింది. చైనా, అమెరికా.. నువ్వా నేనా అని పోటీపడుతున్న ప్రాంతంలో అనూహ్య ఘటన జరిగింది. సబ్‌మైరైన్‌లోని నేవీ సిబ్బంది గాయాల పాలయ్యారు.

America
US Nuclear Submarine : దక్షిణ చైనా సముద్రంలో మరో అలజడి రేగింది. చైనా, అమెరికా.. నువ్వా నేనా అని పోటీపడుతున్న ప్రాంతంలో అనూహ్య ఘటన జరిగింది. అమెరికా న్యూక్లియర్ సబ్‌మెరైన్ ప్రమాదానికి గురైంది. గత కొన్నేళ్లుగా వివాదం నెలకొన్న అంతర్జాతీయ సముద్ర జలాల ప్రాంతంలోకి వెళ్లిన జలాంతర్గామి… అనుకోకుండా ఓ వస్తువును ఢీకొట్టింది. అమెరికా నేవీకి చెందిన న్యూక్లియర్ సబ్‌మెరైన్.. ఐదురోజుల క్రితం సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. నీటి అడుగున ప్రయాణం చేస్తూ గుర్తు తెలియని వస్తువును ఢీకొట్టింది. దీంతో సబ్‌మైరైన్‌లోని నేవీ సిబ్బంది గాయాల పాలయ్యారు.
Read More : Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రాకు సమన్లు, విచారణకు వస్తారా ? అసలు ఎక్కడున్నారు ?
ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. 9మంది స్వల్పంగా గాయపడ్డారు. అయితే.. ఎవరికీ ప్రాణాపాయం లేదని, సబ్ మెరైన్‌లోని న్యూక్లియర్ రియాక్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అమెరికా నేవీ అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని వివరించారు. అయితే.. ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగింది, సముద్ర జలాల అడుగున సబ్‌మెరైన్ దేనిని ఢీకొట్టిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. సముద్రంలో ఎప్పుడో మునిగిసోయిన కంటైనర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.
Read More : US Visas : ట్రావెల్ బ్యాన్ ఉన్నా..వీసాల జారీ ఆపకూడదన్న యూఎస్ కోర్టు..భారత ఐటీ నిపుణులకు ఊరట
ఈ ప్రమాదం అనంతరం జలాంతర్గామి.. గువామ్‌లోని పోర్టు వైపు వెళ్లింది. దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతాన్ని తనదని చెబుతోంది. ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపాన్ని కూడా నిర్మిస్తోంది. దీనిపై అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు… చైనా యుద్ధవిమానాలు తరచూ తైవాన్ గగనతలంలోకి చొచ్చుకువెళ్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి సబ్‌మెరైన్‌కు ప్రమాదం తప్పినా… భవిష్యత్‌లో ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.