అమెరికా ఆఫర్ : లాడెన్ కొడుకు ఆచూకీ చెప్తే రూ.8 కోట్లు

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 03:58 AM IST
అమెరికా ఆఫర్ : లాడెన్ కొడుకు ఆచూకీ చెప్తే రూ.8 కోట్లు

లాడెన్ కుమారుడు అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నాడని, ఆల్ ఖైదా గ్రూప్ కి నేతగా ఎదుగుతున్నాడని స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. హమ్ జా.. ఏ దేశంలో ఉన్నా అతడు ఉన్న లొకేషన్ చెప్తే చాలు రూ.8 కోట్లు ఇస్తామని ప్రకటించింది. సౌదీ యువరాజుని పోలి ఉండే అమ్ జా పాకిస్తాన్, ఆప్గనిస్తాన్, సిరియా, ఇరాన్ లో హౌస్ అరెస్ట్ లో ఉన్నట్లుగా కొన్నేళ్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. 

పాకిస్తాన్ లోని అబోటాబాద్ లోని ఓ ఇంట్లోని అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్ ని 2011లో అమెరికా ప్రత్యేక బలగాలు ఆపరేషన్ నిర్వహించి చంపేశాయి. చనిపోయిన లాడెన్ శవాన్ని కూడా కనపడకుండా చేశారు. లాడెన్ మరణం తర్వాత ఆయన ముగ్గురు భార్యలు, పిల్లలు సౌదీ అరేబియా చేరుకున్నారు. హమ్ జా బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడో ఇప్పటివరకు తెలియదు. ఇరాన్ లో తన తల్లి దగ్గరే అహుజా ఎక్కువ కాలం గడిపినట్లు సమాచారం.

సున్నీ తీవ్రవాదులు ఇరాన్ పై దాడిచేయకుండా తప్పించేందుకు.. ఇరాన్ రాజధాని తెహ్రాన్ లో అక్కడి ప్రభుత్వం హమ్ జాను హౌస్ అరెస్ట్ లో ఉంచినట్లు విదేశీ వర్గాలు తెలిపాయి. హమ్ జా ఆఫ్గనిస్తాన్ లో ఉండే అవకాశముందని గతేడాది హమ్ జా సోదరుడైన ఒకరు మీడియాకు తెలిపారు.