Joint naval drills: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంయుక్త నావికాదళ విన్యాసాలు

 చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంయుక్త నావికాదళ విన్యాసాలు చేపట్టాయి. జపాన్, ఇండో-పసిఫిక్ ప్రాంత రక్షణ, స్థిరత్వం కోసం జపాన్, అంతర్జాతీయ జలాల్లో రెండు వారాల పాటు ఈ ద్వైవార్షిక ‘కీన్ స్వార్డ్’ విన్యాసాలు కొనసాగుతాయి. చైనా దుందుడుకు చర్యలు అధికమవుతున్న వేళ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండొనేషియాలో జీ-20 సమావేశాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.

Joint naval drills: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంయుక్త నావికాదళ విన్యాసాలు

Joint naval drills: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంయుక్త నావికాదళ విన్యాసాలు చేపట్టాయి. జపాన్, ఇండో-పసిఫిక్ ప్రాంత రక్షణ, స్థిరత్వం కోసం జపాన్, అంతర్జాతీయ జలాల్లో రెండు వారాల పాటు ఈ ద్వైవార్షిక ‘కీన్ స్వార్డ్’ విన్యాసాలు కొనసాగుతాయి. చైనా దుందుడుకు చర్యలు అధికమవుతున్న వేళ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండొనేషియాలో జీ-20 సమావేశాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇదే సమయంలో జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి అమెరికా ఈ విన్యాసాలు ప్రారంభించడం గమనార్హం. ఇండో-పసిఫిక్ ప్రాంతంతో అమెరికా, దాని మిత్రదేశాలకు చైనా నుంచి సవాళ్లు పెరిగిపోతున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, తైవాన్ కు చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేలా సిద్ధమయ్యేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తుంటాయి.

జలాంతర్గాములను ఎదుర్కోవడం, క్షిపణులను తిప్పికొట్టడం వంటి విన్యాసాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా యుద్ధ విమానాలు పాలు పంచుకున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా నేవీ కూడా ఈ సారి వాటిని సమకూర్చడంతో.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టేందుకు మరింత బలం చేకూరిందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, తైవాన్ ను తన అధీనంలోకి తెచ్చుకోవాలని చైనా పలు చర్యలకు పాల్పడుతోంది. దీంతో యుద్ధం భయం నెలకొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ చాలా కాలం నుంచి చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..