చైనాను వెనక్కు నెట్టేందుకు చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్లాన్ చేస్తున్న అమెరికా

చైనాను వెనక్కు నెట్టేందుకు చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్లాన్ చేస్తున్న అమెరికా

Nuclear Power Plant on Moon: చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేయడం కాదు. కాలనీలు పెడతామని చైనా అంటుంటే.. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలుపెడతామని అమెరికా అంటుంది. 2027నాటికి చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం చైనా చంద్రుడిపై ఆస్ట్రోనాట్స్ కోసం కాలనీ ఏర్పాటు చేయాలనుకుంది. దానికి పోటీగా యూఎస్ స్పేస్ పాలసీ డైరక్టివ్-6 (ఎస్పీడీ-6) ప్రకారం ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాట్లు చేసేయాలని ప్లాన్ చేస్తుంది.

చైనా మిలటరీ ఎక్స్‌పర్ట్ సాంగ్ ఝాంగ్‌పింగ్ దీని గురించి చెబుతూ.. చంద్రుడిపై హీలియం-3 అనేది సమృద్ధిగా ఉంటుంది. న్యూ క్లియర్ ఫ్యూజన్ ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తయారుచేయడానికి కావలసిని న్యూ క్లియర్ మెటేరియల్స్‌ను చంద్రుడిపై వనరులతో సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడి నుంచే న్యూ క్లియర్ వెపన్స్ రెడీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. స్టార్ట్ చేసిన ఎస్పీడీ-6 స్పేస్ న్యూక్లియర్ పవర్ అండ్ ప్రొపల్షన్ (ఎస్ఎన్పీపీ) సిస్టమ్స్‌కు ఎఫెక్టివ్ యూజ్ అవడంతో పాటు నేషనల్ స్ట్రాటజీకి రెస్పాన్సిబుల్‌గా కూడా ఉంటుంది. మరోవైపు చైనాకు చెందిన Change’5 సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవడంతో మూన్ మిషన్ పూర్తి చేసుకుని ల్యూనార్ శాంపుల్స్ తో రిటర్న్ అయింది.

ఎస్పీడీ-6కు యూఎస్ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని బట్టి చూస్తే చైనాను స్పేస్ రేస్‌లో నిలపాలనుకుంటున్నట్లు అర్థం అవుతుంది. రొనాల్డ్ రీగన్స్ నేతృత్వంలో 1980ల్లో సోవియట్ యూనియన్ చేసిన స్టార్ వార్స్ ప్రోగ్రాం లాంటిదే ఇది. బ్యాలిస్టిక్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ సహాయంతో యునైటెడ్ స్టేట్స్‌ను ప్రొటక్ట్ చేసుకోవాలని స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనీషియేషన్ ఇటువంటి ప్లాన్ చేస్తుంది.