Biden On Omicron : శుభవార్త ఉంది..ఒమిక్రాన్ టెన్షన్ వేళ బైడెన్ కీలక వ్యాఖ్యలు

కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న వెళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన దగ్గర ఓ గుడ్ న్యూస్ ఉందంటూ ముందుకొచ్చారు. ఫైజర్-బయోఎన్ టెక్ అభివృద్ధి చేసిన

Biden On Omicron : శుభవార్త ఉంది..ఒమిక్రాన్ టెన్షన్ వేళ బైడెన్ కీలక వ్యాఖ్యలు

Biden

Biden On Omicron :  పనిచేస్తుందనే తాజా రిపోర్ట్ పై బుధవారం బైడెన్ మాట్లాడుతూ..”ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ నుంచి మనల్ని రక్షిస్తాయని భావిస్తున్నట్లు ఫైజర్ ల్యాబ్ నుంచి తాజాగా వచ్చిన ఓ రిపోర్ట్ చెబుతోంది. అయితే మీరు బూస్టర్ డోసు తీసుకున్నట్లయితే..మీరు మరింత సేఫ్ గా ఉంటారు. ఇదొక ప్రోత్సాహకరమైన పరిణామం. ఆ ల్యాబ్ రిపోర్ట్ పైన మరిన్ని స్టడీలు జరుగుతున్నాయి. కానీ ఇది చాలా చాలా ప్రోత్సాహకరమైనది”అని అన్నారు.

మరోవైపు,ఒమిక్రాన్ నుంచి రక్షణకు తమ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ మాత్రమే సరిపోకపోవచ్చునని,బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాతే అది ఇంకా ప్రభావవంతంగా ఉంటుందని ఫైబర్/బయోఎన్ టెక్ కంపెనీలు తెలిపాయి. ఒమిక్రాన్ వేరియంట్..రెండు డోసుల వ్యాక్సిన్ తర్వాత తగినంతగా కట్టడికాకపోవచ్చునని ఈ రెండు కంపెనీలు హెచ్చరించాయి.

రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారి బ్లడ్ సీరమ్ ఉయోగించి తాజాగా చేసిన లేబరేటరీ పరిశోధనలో…ప్రారంభ స్ట్రెయిన్ కి రెండవ డోసు తీసుకున్న తర్వాత కనిపించిన మాదిరిగానే బూస్టర్ డోస్ తర్వాత ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా అదే స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి అయ్యాయి.

ప్రస్తుత వ్యాక్సిన్ యొక్క రెండు డోసులను స్వీకరించిన సుమారు 20 మంది వ్యక్తుల నుండి సేకరించిన రక్త నమూనాలు వైరస్ యొక్క ప్రారంభ జాతితో పోలిస్తే యాంటీబాడీలను తటస్థీకరించడంలో(neutralised) సగటున 25 రెట్లు తగ్గింపును చూపించాయని ఫైబర్/బయోఎన్ టెక్ కంపెనీలు తెలిపాయి. అయితే రోగనిరోధక ప్రతిస్పందనలో మరొక భాగం – T కణాల నుండి బహుశా ఇప్పటికీ వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని, టీకాలు తీసుకున్న వ్యక్తులు ఇప్పటికీ వ్యాధి యొక్క తీవ్రమైన రూపాల నుండి రక్షించబడవచ్చు అని తెలిపాయి.

ALSO READ Boris And Carrie Johnson : బ్రిటన్ ప్రధాని బోరిస్ దంపతులకు ఆడబిడ్డ