కోటిమంది ప్రజలు స్వాగతం పలుకుతారని ట్రంప్ ఆశ..కానీ నిరాశ తప్పేలా లేదు ఎందుకంటే..

భారత్ టూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో నాకు కోటిమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ నాకు హామీ ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : February 21, 2020 / 07:31 AM IST
కోటిమంది ప్రజలు స్వాగతం పలుకుతారని ట్రంప్ ఆశ..కానీ నిరాశ తప్పేలా లేదు ఎందుకంటే..

భారత్ టూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో నాకు కోటిమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ నాకు హామీ ఇచ్చారు.

భారత్ టూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను భారత్ వస్తే  అహ్మదాబాద్‌లో 5 లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని వ్యాఖ్యానించి ట్రంప్ ఈసారి లెక్కలు మార్చేశారు. కోటిమంది స్వాగతం పలుకుతారని అన్నారు. కానీ భారత్ లో ట్రంప్ కు నిరాశ తప్పేలా లేదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అహ్మదాబాద్ మొత్తం జనాభా 56 లక్షలు ఉంటే కోటి మంది ఎలా వస్తారని దీంతో ట్రంప్ ఆశలు నిరాశలు కాక తప్పదని అంటున్నారు. 

‘‘మీరు భారత్ వస్తే మీకోసం 5 లక్షల మంది మీకు స్వాగతం పలుకుతారని తనకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారనీ తెలిపిన ట్రంప్..5 లక్షల మందికాదు కదా కోటి మంది వచ్చినా తనకు సంతోషం కలగదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ భారత్ టూర్ పై ట్రంప్ అతిగా ఆశలు పెట్టుకుంటున్నారనీ..నా రేంజ్ అలా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఘన స్వాగతం ఉంటుందని అతిగా ఆశపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా భారత్ టూర్ లో భాగంగా ట్రంప్ రోజుకో వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు స్వాగతం పలకటానికి భారతీయులు లక్షలమంది వస్తారని ఓసారి.. కాదు కోటి మంది వస్తారంటూ  మరోసారీ ఇలా రోజురకమైన లెక్కలు చెబుతున్నారు. తనకు స్వాగతం పలికేందుకు 5 లక్షలమంది ప్రజలు వస్తారని మోడీ తనకు చెప్పారని అన్నారు. మరోసారి ఆ 5లక్షల్ని ఏకంగా 10 లక్షలని ..కాదు కాదు 70లక్షలు అని ఇంకోసారి ఇలా రోజుకోరకమైన లెక్కలు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆ 70లక్షల్ని 10 మిలియన్స్ అంటే  కోటి మంది వస్తారని తనకు మోడీ మాట ఇచ్చారని వ్యాఖ్యానించారు. కాగా మోడీ నిజంగా ట్రంప్ కు మాట ఇచ్చారా?ట్రంప్ తనకు తానే ఓ రేంజ్ లో ఊహించేసుకుంటున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి రోజుకోవిధంగా ట్రంప్ మాట్లాడుతుంటే.

ఎయిర్ పోర్ట్ నుంచి అహ్మదాబాద్ స్టేడియం.. రిసెప్షన్ కు వెళ్లే మొత్తం 22 కిలోమీటర్ల రోడ్డు మార్గమంతా  వరకూ తనకు కోటిమంది స్వాగతం పలుకుతారంటూ అతిశయం ప్రదర్శిస్తూ..ఓ సభలో మాట్లాడుతున్న సందర్భంగా  ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ట్రంప్ అతిశయం..బీజేపీ ప్రభుత్వం హంగామా చూస్తున్న ప్రజలు చిత్ర  విచిత్రమైన సెటైర్లు వేస్తున్నారు.