ట్రంప్ కామెంట్స్: అమెరికా టార్గెట్ యుద్ధం కాదు.. ఇరాన్‌ను వదిలేది లేదు

ట్రంప్ కామెంట్స్: అమెరికా టార్గెట్ యుద్ధం కాదు.. ఇరాన్‌ను వదిలేది లేదు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ పై దాడులు జరిపిన తర్వాత వైట్ హౌజ్ వేదికగా మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా శాంతిని కోరుకుంటుందని అలా అని ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదని తెలిపారు. 

* ఇరాన్ దాడిలో ఏ ఒక్క యూఎస్ ఆర్మీ ఎవరూ గాయపడలేదు
* అమెరికా యుద్ధాన్ని కాంక్షించడం లేదు.
* ఉగ్రవాద గ్రూపులకు సులేమాని శిక్షణ ఇచ్చారు. 
* ప్రముఖ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మద్ధతు ఇచ్చారు.
* వందలాది అమెరికన్ల మృతికి కారణమయ్యారు. 
* ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. 
* నా నాయకత్వంలో అమెరికా ఎకానమీ వృద్ధిలో ఉంది. 
* రష్యా, చైనా, ఫ్రాన్స్ ఈ విషయాన్ని గుర్తించాలి. 
* ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని సహించేది లేదు. 
* పశ్చిమాసియాలో అశాంతిని ప్రోత్సహిస్తున్నాయి.

* అమెరికాపై కొత్త దాడులు జరపడానికి సులేమానీ ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నాం. 
* నేను ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలను వాడడానికి వీలు లేకుండా చేస్తా. 
* ఇరాన్ వెనక్కు తగ్గినట్లు కనిపిస్తుంది. ఇది ప్రపంచానికి శుభపరిణామం. 

 

సులేమాని అంత్యక్రియలు జరిపిన వెంటనే…. ప్రతీకార చర్యలను ప్రారంభించింది. బుధవారం(జనవరి 8,2020) ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్‌ను ప్రయోగించింది. అమెరికా సైనిక, సంకీర్ణ దళాలకు ఆశ్రయం ఇస్తున్న రెండు ఇరాకీ సైనిక స్థావరాలైన అల్ అసాద్, ఇర్బిల్‌పై 12 క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా వెంటనే తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలపైనా దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

ఈ దాడులపై స్పందించిన అమెరికా.. ఆల్ ఈజ్ వెల్ అని స్టేట్ మెంట్ మిచ్చింది. కాగా, ఇరాన్ మీడియా మాత్రం.. ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడుల్లో 80మంది అమెరికన్ టెర్రరిస్టులు హతమయ్యారని వార్తలు ప్రసారం చేసింది. అమెరికా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పింది. అమెరికా విమానాలకు, ఆర్మీకి చెందిన సామాగ్రికి తీవ్రమైన నష్టం జరిగినట్లు కథనాలు ఇచ్చింది.