పాకిస్తాన్‌కు మరో షాక్ : F-16 దుర్వినియోగంపై వివరణ కోరిన అమెరికా

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను సురక్షితంగా పాకిస్తాన్ చెర నుంచి విడిపించడంలో సక్సెస్ అయిన భారత్.. ఇప్పుడు మరో విషయంలో సఫలమైంది. F-16 యుద్ధ

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 09:55 AM IST
పాకిస్తాన్‌కు మరో షాక్ : F-16 దుర్వినియోగంపై వివరణ కోరిన అమెరికా

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను సురక్షితంగా పాకిస్తాన్ చెర నుంచి విడిపించడంలో సక్సెస్ అయిన భారత్.. ఇప్పుడు మరో విషయంలో సఫలమైంది. F-16 యుద్ధ

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను సురక్షితంగా పాకిస్తాన్ చెర నుంచి విడిపించడంలో సక్సెస్ అయిన భారత్.. ఇప్పుడు మరో విషయంలో సఫలమైంది. F-16 యుద్ధ విమానాల  దుర్వినియోగం విషయంలో పాకిస్తాన్‌ను… భారత్ అడ్డంగా బుక్ చేసింది. F-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్ మిస్ యూజ్ చేసిందని ఆధారాలతో సహా అమెరికా ముందు భారత్ ఉంచింది.
Read Also : రైతులు కావలెను : జీతం 20 వేలు

దీనికి  అమెరికా నుంచి స్పందన వచ్చింది. భారత్‌పై దాడికి F-16 యుద్ధ విమానాలను ఎందుకు వాడారో చెప్పాలని పాకిస్తాన్‌ను అమెరికా డిమాండ్ చేసింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కోరింది.  దీంతో పాకిస్తాన్ చిక్కుల్లో పడింది. అమెరికాకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా పాక్ యుద్ధ విమానాలు ఫిబ్రవరి 27న భారత  భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబులు వేశాయి. ఈ దాడిలో అత్యాధునిక F-16 యుద్ద విమానాలను పాక్ వినియోగించింది.
Read Also : తప్పుడు రాతలు ఆపండి.. పాక్ మీడియా కథనంపై పవన్ కళ్యాణ్

వెంటనే అలర్ట్ అయిన భారత  వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ మిగ్-21 యుద్ధ విమానంతో పాక్ యుద్ధ విమానాల పని పట్టాడు. శత్రు విమానాలను తరిమి కొట్టడమే కాకుండా ఒక F-16 విమానాన్ని కూల్చేశాడు. F- 16తో పాటు అందులో వాడుతున్న అమ్రామ్ క్షిపణి శకలాలను భారత్ అమెరికాకు అందించి పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టింది. దీనిపై తొలుత బుకాయించిన పాక్ నేతలు.. భారత్ పూర్తి స్థాయి  ఆధారాలు అందించడంతో అడ్డంగా దొరికిపోయారు. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
Read Also : జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి

అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలు F-16 యుద్ధ విమానాన్ని తయారు చేస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతతో పాటు ఆత్మరక్షణకు మాత్రమే F-16లను వాడతామని  హామీ ఇచ్చిన పాకిస్తాన్.. వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు రూల్స్‌ను బ్రేక్ చేసి కశ్మీర్‌లో భారత ఆర్మీ స్థావరాలపై దాడికి F-16 యుద్ధ విమానాలను పాక్ వాడింది.

Read Also : ఎలానో తెలుసుకోండి : డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ