అమెరికా మిలటరీలో ట్రాన్స్ జెండర్లు : ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం

అమెరికా మిలటరీలో ట్రాన్స్ జెండర్లు : ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం

అమెరికా మిలటరీలో ట్రాన్స్ జెండర్ల నియామకంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ   అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సమర్థించింది. ఓ వైపు ట్రంప్ నిర్ణయంపై కింది కోర్టుల్లో వాదనలు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు మంగళవారం(జనవరి 22,2019) ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. 5-4 తేడాతో సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పుని నలుగురు సుప్రీం జడ్జిలు జస్టిస్ రూథ్ బాదర్ గిన్స్ బర్గ్, జస్టిస్ సోనియా సోటోమేయర్, జస్టిస్ స్టీఫెన్ బ్రీయర్, జస్టిస్ ఎలీనా ఖగన్ లు  వ్యతిరేకించారు.

 2017 జులైలో విపరీతమైన మెడికల్ ఖర్చులు, అంతరాయం కారణంగా మిలటరీలో సేవ చేసేందుకు ట్రాన్స్ జెండర్ అమెరికన్ లను దేశం ఇకపై అనుమతించబోమంటూ ట్రంప్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం మాజీ అధ్యక్షడు ఒబామా యంత్రాంగం ట్రాన్స్ జెండర్ అమెరికన్లు ఓపెన్ గా మిలటరీలో సేవ చేయవచ్చునని, అదే విధంగా లింగమార్పిడి సర్జరీకి నిధులు పొందగలరని తీసుకొన్న పాలసీకి వ్యతిరేకంగా ఉంది.