7రోజుల హింస తగ్గింపు…ఒప్పందంపై సంతకానికి అమెరికా-తాలిబన్లు రెడీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2020 / 02:24 PM IST
7రోజుల హింస తగ్గింపు…ఒప్పందంపై సంతకానికి అమెరికా-తాలిబన్లు రెడీ

ఆఫ్గనిస్తాన్ లో వారం రోజులపాటు  హింస తగ్గింపుకు సంబంధించి ఫిబ్రవరి 29,2020న అమెరికా,తాలిబాన్ ఓ ఒప్పందంపై సంతకం చేస్తాయని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, తాలిబాన్ ప్రతినిధులు శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) ప్రకటించారు. అమెరికా-ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ (తాలిబన్ల పాలనలో ఉన్న రాష్ట్రం)ల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఖరారైన ఒప్పందంపై అంతర్జాతీయ అబ్జర్వర్ల సమక్షంలో ఇరు పక్షాలు సంతం చేయనున్నట్లు తాలిబన్ ప్రతినిధి ఓ స్టేట్ మెంట్ లో తెలిపారు. అంతేకాకుండా బంధీలుగా ఉన్నవారిని విడుదలచేసేందుకు ఇరు పక్షాలు ఏర్పాట్లు చేయనున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.

ఆఫ్గనిస్తాన్ లో రాజకీయ సెటిల్ మెంట్,ఆ ప్రాంతంలో అమెరికా బలగాల తగ్గింపుకు సంబంధించి అమెరికా-తాలిబన్లు చర్చల్లో పాల్గొన్నట్లు మరో ప్రకటనలో అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి పోంపియో తెలిపారు. తాలిబన్లతో  ముఖ్యమైన మరియు ఆఫ్గనిస్తాన్ వ్యాప్తంగా హింస తగ్గింపును విజయవంతంగా అమలుచేసే ఒక అవగాహనతో ఒప్పందం సంతకం చేయబడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ ఒప్పందం…. సంవత్సరాల యుద్ధం తరువాత ఆఫ్గనిస్తాన్ దేశంలో శాంతికి అవకాశం ఉంది. మరియు 2001నుంచి ఆ ప్రాంతంలో తాలిబన్లతో అమెరికా బలగాలు పోరాడుతున్న విషయం తెలిసిందే. అమెరికా బలగాలకు కూడా కొంచెం పని తగ్గిపోతుంది. తమ భూభాగ ఆధిపత్యాన్ని తాలిబన్లు విస్తరిస్తుండంతో ఆఫ్ఘనిస్తాన్లో పోరాటం చెలరేగి వేలమంది ప్రజలు,సైనికులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ 2018నుంచి ఖతార్ దేశ రాజధాని దోహ సిటీలో  అమెరికా-తాలిబన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.

ఫ్లాన్ ప్రకారం…నెలలో పూర్తిగా  ఒక వారం తాలిబన్ అండ్ ఇంటర్నేషనల్ మరియు ఆఫ్టాన్ భద్రతా బలగాల మధ్య హింసలో తగ్గింపు ఉంటుందని ఆఫ్గాన్ జాతీయ భద్రతా సలహాదారు జావిద్ ఫైజల్ తెలిపారు. భవిష్యత్తులో ఇది దీర్ఘకాలం పొడిగించబడుతుందని ఆశిస్తున్నట్లు కాల్పుల విరమణ,ఇన్ ట్రా-ఆఫ్గాన్ చర్చలకు మార్గం తెరుస్తుందని ఆశిస్తున్నట్లు జావిద్ తెలిపారు. ఆఫ్గనిస్తాన్ లో ఈ వారం రోజుల హింస తగ్గింపు వచ్చే శుక్రవారం అర్థరాత్రి నుంచే అమలులోకి రానుంది.

కాల్పుల విరమణ కాదు

అయితే ఈ వారం రోజుల సమయాన్ని కాల్పుల విరమణగా పిలవకూడదని ఓ తాలిబన్ లీడర్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ హక్కు ఉందని కానీ ఒకరి స్థావరాలపై మరొకరు దాడులు చేయడం ఈ ఏడు రోజుల్లో జరుగదని ఆయన చెప్పారు. ఇది ఆఫ్గనిస్తాన్ లో భద్రతా వాతావరణాన్ని సృష్టించేందుకేనని,అమెరికాతో శాంతి ఒప్పందంపై సంతకాల తర్వాత పరిస్థులు బాగుంటే ఏడు రోజుల గడువు పొడిగించబడుతుందని ఆయన తెలిపారు.