భర్త చనిపోయిన టీచర్‌కు విద్యార్ధి‌ లేఖ..‘మీ హృదయాలను కలిపే లైన్ ఉంటుంది టీచర్’..

భర్త చనిపోయిన టీచర్‌కు విద్యార్ధి‌ లేఖ..‘మీ హృదయాలను కలిపే లైన్ ఉంటుంది టీచర్’..

us teacher receives heartwarming letter student : ఒకసారి పోతే తిరిగిరానిది ప్రాణం ఒక్కటే. అలా పోయని ప్రాణం ఆత్మీయులదైతే..ముఖ్యంగా జీవితాన్ని పంచకున్నవారిదైతే..ఇక వారి మానసిక వేదనను వర్ణించలేం. ఆ బాధ గురించి చెప్పటానికి మాటలు చాలవు.అటువంటి వేదన సమయంలో ఓ చిన్న ఓదార్పు మనస్సుని కాస్త అయినా తేలికబరుస్తుంది. రెండు చల్లని మాటలు బాధను పూర్తిగా తీసేయలేకపోయినా..కాస్తైనా ఉపశమనం కలిగిస్తాయి. అలా భర్తను కోల్పోయిన ఓ టీచర్ కు ఓ విద్యార్ధి రాసిన లెటర్..దాంట్లో ఆ విద్యార్ధి తన డ్రాయింగ్ ద్వారా ఓదార్పు మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

అమెరికాలోని ఓ పాఠశాలలో మెలిస్సా మిల్నర్‌ అనే మహిళ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ఈమె భర్త చనిపోయాడు. దీంతో ఆమె బాగా కృంగిపోయింది. అలా కృంగిపోయిన టీచర్ ను చూసిన ఓ విద్యార్ది కూడా బాధపడిపోయాడు. దీంతో ఆమె త్వరగా బాధ నుంచి బైటపడాలని కోరుకున్నాడు. దీని కోసం టీచర్ కు ఓ లెటర్ రాశాడు. అందమైన లేఖను రాసి ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడు. ఆ లెటర్‌లో టీచర్‌పై తనకున్న గౌరవాన్ని మాటల రూపంలో తెలియజేశాడు.ఈ లెటర్ చదివిన ఆ టీచర్ ఆ విద్యార్ధి రాసిన పదాలకు సంతోషపడింది. ఆ లెటర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసిందా టీచర్.

‘ఆ స్టూడెంట్ టీచర్ కు రాసిన లెటర్ లో ఇలా ఉంది : ‘‘ప్రియమైన మిసెస్ మిల్నర్. మీరు భర్తను కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మిస్టర్ మిల్నర్‌ను మీరు ఇక చూడలేక పోయినప్పటికీ, మీ హృదయాలను కలిపే ఒక లైన్ ఎప్పుడూ ఉంటుందని మీరు ఇంకా తెలుసుకోవాలి. మీరు ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను.’ అని రాసాడు.

ఆ లెటర్ లో డ్రాయింగ్ కూడా వేశాడా విద్యార్ధి. టీచర్ మెలిస్సా ఆకాశం వైపు చూస్తూ, తన హృదయాన్ని స్వర్గంలో..తన భర్త హృదయంతో కలుపుతూ బొమ్మలు వేశాడు. ప్రస్తుతం ఈ లెటర్‌ నెట్టింట్లో వైరల్‌గా
మారింది. లక్షల్లో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా ఎమోషన్‌ల్‌గా ఉందని లెటర్‌ను చదివిన నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. చిన్న వయస్సు అయినా ఆ విద్యార్ధి టీచర్ బాధను అర్థం చేసుకున్నవిధానం చాలా గొప్పగా ఉందని అంటున్నారు.

As I grieve the sudden death of my husband, my students warm my heart. #grief #love #loss pic.twitter.com/v1SUmw4m5l
— Melissa Milner (@melissabmilner) February 28, 2021