లక్కీ డాగ్ : పెంపుడు కుక్కకు రూ.36 కోట్ల ఆస్తి రాసిన యజమాని

లక్కీ డాగ్ :  పెంపుడు కుక్కకు రూ.36 కోట్ల ఆస్తి రాసిన యజమాని

US Tennessee Man Leaves 5 Million to Dog : అమెరికాలోని టేన్నసీలో నివసించే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కమీద ఉన్న ప్రేమతో దాని పేరుమీద ఏకంగా 5 మిలియన్‌ డాలర్ల ఆస్తి రాశాడు. అదే మన భారతదేశ కరెన్సీలో చెప్పాలంటే 36,29,55,250 రూపాయలు. అంత పెద్ద మొత్తాన్ని తన వీలునామా ద్వారా తన పెంపుడు కుక్క పేరున రాసేశాడు.

యూఎస్ లోని టేన్నసీకి చెందిన బిల్‌ డోరిస్ అనే 84 ఏళ్ల వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా లులు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. లులు అంటే బిల్ డోరిస్ కు ప్రాణం. ట్రావేలింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే డోరీస్‌ తరచుగా ప్రయాణాలు చేసేవాడు. ఆ సమయంలో పెంపుడు కుక్క లులుని తన స్నేహితుడు మార్త్ బర్టన్‌ వద్ద వదిలేసి వెళ్లేవాడు.

ఈ క్రమంలో 2020లో డోరిస్‌ చనిపోయాడు. అప్పటి నుంచి లులు బాధ్యతని అతని స్నేహితుడు మార్త్ మార్టనే తీసుకున్నాడు. ఆ తరువాత కొన్ని రోజుల క్రితం డోరిస్‌ లాయర్‌ మార్త్ మార్టన్ ఇంటికి వచ్చారు. వచ్చి..కొన్ని పేపర్స్ అతని చేతిలో పెట్టారు.అవి వీలునామా పేపర్లు. ఇదేంటీ ఇవి నాకిస్తున్నారు? అని అడిగాడు లాయర్ ని మార్త్. దానికి లాయర్ డోరిస్ చనిపోవడానికి ముందు రాసిన వీలునామాను మార్టన్‌కి అందించాడు. దానిలో డోరిస్‌ తన పెంపుడు కుక్క లులు పేరిట 5 మిలియన్‌ డాలర్ల ఆస్తి రాసినట్లుగా ఉంది.

లులు సంరక్షణకు, దాని అవసరాలకు అయ్యే ఖర్చుల కోసం ఆ డబ్బుని వాడాలని వీలునామాలో కోరాడు. ఇక లులు బాధ్యతని తన స్నేహితుడు మార్టన్‌కి తీసుకోవాల్సిందిగా వీల్లులో అభ్యర్థించాడు డోరిస్‌. లులు పేరు మీద ఉన్న ఆస్తికి అతను ట్రస్టీగా ఉంటాడని వీలునామాలో రాసాడు.

అది చదివిన మార్త్ ఆశ్చర్యపోయాడు. ఈ సందర్భంగా మార్టన్‌ మాట్లాడుతూ.. ‘‘డోరిస్‌ రాసిన వీలునామా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. డోరిస్‌, లులు ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్లు. లులును నా స్నేహితుడు తన బిడ్డలానే చూసేవాడు..ఆ ప్రేమను నామీద ఉన్న నమ్మకాన్ని ఇలా రాసాడని తెలిపారు..