40ఏళ్లుగా..సగం తిన్న ఫుడ్డుని భర్త లంచ్ బాక్సులో పెడుతున్న భార్య..

  • Published By: nagamani ,Published On : December 14, 2020 / 04:13 PM IST
40ఏళ్లుగా..సగం తిన్న ఫుడ్డుని భర్త లంచ్ బాక్సులో పెడుతున్న భార్య..

US Texas wife bite out of her husband’s lunch box : భర్తకు లంచ్ బాక్స్ పెట్టాలంటే కాస్త భార్యలు కాస్త స్పెషల్ గానేపెడతారు. రుచిగా చేసి బాక్సు నిండా నొక్కి నొక్కి పెడతారు. వాటితో పాటు చిరుతిళ్లు కూడా పెడతారు. కానీ ఓ భార్య మాత్రం తన భర్తకు పెట్టే లంచ్ బాక్సులో ఆహారాన్ని ఎంగిలిచేసి పెడుతుంది. ఏదైతే బాక్సులో పెట్టాలనుకుంటుందో దాన్ని కొరికి తిని మిగతాది బాక్సులో పెడుతుంది. అలా ఏడాది రెండేళ్లుగా కాదు గత 40 ఏళ్లుగా ఆమె సగం తిన్న ఆహారాన్ని భర్తకు లంచ్ బాక్సులో పెడుతుంది.

భార్యపెట్టిన ఫుడ్ ను కొంచెం కూడా వదలకుండా ఆ భర్త చక్కగా తినేస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..తన భార్య తనకు లంచ్ బాక్సులో పెట్టేఆహారాన్ని ఎంగిలి చేసి పెడుతుందనే విషయం ఆ భర్తకు తెలుసు. తెలిసే తింటున్నాడు. ఇదేదో ఆకతాయిగా జరిగే పనికాదు.కావాలనే ఆ భార్య ఎంగిలి చేసిన ఆహారాన్ని పెడుతుంది. మరి దీని వెనుక ఉన్న ఆ అంతరార్థం ఏమిటో తెలుసుకోవాల్సిందనని పిస్తోంది కదూ..నిజమే వీరి ‘ఎంగిలి లంచ్ బాక్సు’ వెనుక గుండెను కదిలించే కథను తెలుసుకుందాం..

టెక్సా‌స్‌కు చెందిన ట్రాసీ హౌవెల్, క్లిఫోర్డ్ భార్య భర్తలు. వారికి వివాహం జరిగి 40 ఏళ్లు అయ్యింది. ట్రాసీ తన భర్తకు లంచ్ బాక్సులో పెట్టే ఫుడ్ ను కొద్దిగా తిని పెడుతుంది.బర్గర్ అయినా పిజ్జా అయినా..ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే కొంచెం కొరికి తిని మిగిలింది బాక్సులో పెడుతుంది. పెళ్లయిన మొదటి రోజు నుంచి ఆమె ఇదే పనిచేస్తోంది. ఆ విషయం తెలిసిన భర్త కూడా చక్కగా కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తాడు. అదీ వారి 40 ఏళ్ల అన్యోన్య దాంపత్యంలోని మధురానుభూతి.

ఆ మధురానుభూతి గురించి ట్రాసీ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా వివరంగా చెప్పింది. ‘నా భర్త క్లిఫోర్ట్ నాకు మొదటిసారి ఓ జాబ్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమయ్యాడు. అలా అతను ఓ రోజు నాతో కలిసి లంచ్ చేశాడు. లంచ్ చేసేటప్పుడు నాతో క్లిఫోర్డ్ ఓ మాట అన్నాడు. ‘‘మీరు ఇష్టపడే వారితో భోజనాన్ని పంచుకున్నప్పుడు.. అది మరింత రుచిగా ఉంటుందీ’’ అని..ఆ మాట నా మనసులో అలాగే నాటుకుపోయింది. నేను ఏది తింటున్నా ఆ మాట గుర్తుకొచ్చేది.

కొరిన ఫుడ్ గురించి మరిన్ని వివరాలు ఇలా..ఆ లంచ్ పరిచయం తరువాత ట్రాసీ హౌవెల్, క్లిఫోర్డ్ ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ పెళ్లిగా మారింది. ట్రాసీ ఓ రోజు గతంలో తన భర్త చెప్పిన మాటలను గుర్తుపెట్టుంది. అలా అతను ఆఫీసుకు వెళ్లేటప్పుడు పెట్టే లంచ్ బాక్సులో శాండివిచ్‌ను కొరికి పెట్టి పంపింది.

అది చూసిన తన భర్త.. ‘‘నా శాండ్‌విచ్‌ను ఎవరో కొరికేశారు’’ అని చెప్పాడు. దానికి ఆమె ముసిముసిగా నవ్వుకోటం చూశాడు. ఎందుకలా నవ్వుతున్నావని కొంటెగా అడిగాడు.దానికామె మరోసారి నవ్వింది. దానికి క్లిఫోర్ట్ ‘‘ఏయ్ దొంగా ఏంటీ విషయం’’ అని అడిగాడు.

దానికి ట్రాసీ నవ్వుతూ..‘‘అది కొరికింది నేనే. నేను మీ దగ్గర లేనప్పుడు.. నాతో కలిసి భోజనం చేస్తున్న ఫీలింగ్ నీకు ఇవ్వాలని అలా చేశా’’ అని చెప్పింది. దానికి క్లిఫోర్డ్ భార్యకు తనపై ఉన్న ప్రేమాభిమానాలకు చలించిపోయాడు. దగ్గరకు తీసుకుని ఆర్థ్రంగా ముద్దుపెట్టుకుని ‘‘ఇక ఎప్పటికీ నీ ఎంగిలి ఫుడ్డే నాకు కావాలి’’అని చెప్పాడు.

దానికి ఆమె మనం కలిసి భోజనం చేసేటప్పుడు ఆ అవసరం ఉండదు. కానీ ‘‘ఇకపై ఎప్పుడైనా లంచ్, డిన్నర్ మనం కలిసి చేయలేకపోతున్నప్పుడు. నీకు పంపే ఆహారాన్ని ఇలాగే ఎంగిలి చేసి ఇస్తా’’ అని చెప్పడంతో భర్త భార్యను ప్రేమగా కౌగలించుకుని భలే ఐడియా..నా వైఫ్ వెరీ స్మార్ట్ అండ్ రొమాంటిక్ అని చెప్పాడు. అలా మొదలైంది వారి ఎంగిలి ఫుడ్ కథ. అప్పటి నుంచి ట్రాసీ తన భర్తకు అలా ఎంగిలి చేసిన ఆహారాన్ని పంపుతూనే ఉంది.

దీని గురించి ట్రాసీ మాట్లాడుతూ..మా వివాహం అయి ఇప్పటికి 41 సంవత్సరాలు అయ్యింది అప్పటి నుంచి నేను నా భర్తతో కలిసి భోజనం చేస్తునే ఉన్నానని ఎంతో ప్రేమగా..గర్వంగా చెబుతోంది ట్రాసీ..

అదీ భార్యాభర్తల బంధమంటే.. అదీ ఒకరినొకరు అర్థం చేసుకోవటమంటే..మొగుడూ పెళ్లాలంటూ ఎప్పుడూ గొడవలే అనుకుంటారు. కానీ, ప్రేమను మించిన అనిర్వచనీయమైన ఇటువంటి బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అటువంటి భార్యాభర్తలు ఎప్పటికీ ఒకరిపట్ల మరొకరు గౌరవంగా, ప్రేమతో ఉంటారు..భలే బాగుంది కదూ ‘ఈ ఎంగిలి లంచ్ బాక్సు’ల ప్రేమ గాథ.