Ukraine: యుక్రెయిన్‌కు భారీ సాయం ప్రకటించిన అమెరికా.. ఆయుధాల సరఫరాకు అంగీకారం

రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుక్రెయిన్‌కు అమెరికా అందించబోతుంది. వీటిలో లాంగ్ రేంజ్ రాకెట్లు, ఇతర విలువైన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ వారమే ఈ సాయంపై అమెరికా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Ukraine: రష్యా దాడితో అల్లాడుతున్న యుక్రెయిన్‌కు అమెరికా భారీ మిలిటరీ సాయం ప్రకటించింది. ఆ దేశానికి ఆయుధ సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుక్రెయిన్‌కు అమెరికా అందించబోతుంది.

Budget 2023: క్రీడారంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్.. గతంకంటే ఎక్కువ కేటాయింపులు

వీటిలో లాంగ్ రేంజ్ రాకెట్లు, ఇతర విలువైన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ వారమే ఈ సాయంపై అమెరికా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. యుక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ రాకెట్లు అందించనుండటం ఇదే మొదటిసారి. ఇప్పుడు అందించబోతున్న ఆయుధాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, జావెలిన్ యాంటీ ట్యాంక్ వెపన్స్ వంటివి ఉన్నాయి. నిజానికి తమకు భారీ స్థాయిలో సైనికపరంగా సాయం చేయాల్సిందిగా అమెరికాను యుక్రెయిన్‌ కోరింది. రష్యాపై పోరాడేందుకు ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ఇవ్వాలని అడిగింది. దీనికి అమెరికా నిరాకరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తాము యుక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలు ఇవ్వడం కుదరదని సోమవారం తేల్చి చెప్పాడు.

Maharashtra: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి.. 15 మందికి గాయాలు

అయితే, మరుసటి రోజే యుక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ సాయంలో యుక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇనిషియేటివ్ (యూఎస్ఏఐ) కింద 1.725 బిలియన్ డాలర్ల విలువైన సాయం అందిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే అమెరికా తన స్థావరాల్లో నిల్వ చేసిన ఆయుధాలు కాకుండా.. కొత్తగా ఉత్పత్తి అవుతున్న వాటిని పరిశ్రమల నుంచి నేరుగా అందించనుంది. అమెరికా అందించే నిధుల ద్వారా యుక్రెయిన్‌కు హ్యాక్ ఎయిర్ డిఫెన్సెస్, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, ఎయిర్ సర్వెలయెన్స్ రాడార్స్, ప్యూమా డ్రోన్స్ వంటివి అందుతాయి. యుక్రెయిన్‌పై రష్యా దాడి ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. యుక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.

ట్రెండింగ్ వార్తలు