అంతరిక్షంలో అశాంతి వద్దు : భారత్‌కు అమెరికా వార్నింగ్

అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను కూల్చే వెపన్ ని సొంతం చేసుకోవడం ద్వారా భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించింది. మిస్సైల్ ద్వారా శాటిలైన్ ను కూల్చే ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 06:11 AM IST
అంతరిక్షంలో అశాంతి వద్దు : భారత్‌కు అమెరికా వార్నింగ్

అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను కూల్చే వెపన్ ని సొంతం చేసుకోవడం ద్వారా భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించింది. మిస్సైల్ ద్వారా శాటిలైన్ ను కూల్చే ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా

అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను కూల్చే వెపన్ ని సొంతం చేసుకోవడం ద్వారా భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించింది. మిస్సైల్ ద్వారా శాటిలైట్ ను కూల్చే ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా చేసింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే సాధ్యమైన ఈ ఘనతను ఇప్పుడు భారత్ కూడా సాధించింది. శత్రుదేశాల శాటిలైట్ల ఆటకట్టించే అత్యాధునిక టెక్నాలజీ భారత కు ప్లస్ కానుంది.

భూ ఉపరితలానికి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లైవ్ శాటిలైట్ ను విజయవంతంగా కూల్చేయడం ద్వారా ‘అంతరిక్ష యుద్ధం’ చేయగల సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో సమానంగా భారత్ నిలిచిన వేళ.. అగ్రరాజ్యం అమెరికా అలర్ట్ అయ్యింది. మిషన్ శక్తి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్ కు హెచ్చరికలు జారీ చేసింది. యాంటీ శాటిలైట్ వెపన్స్ తో అంతరిక్షంలో గందరగోళం సృష్టించొద్దని అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి పాట్రిక్ షనాహన్ అన్నారు. తమ ఆందోళన అంతా అంతరిక్షంలో పేరుకుపోయే శకలాల గురించేనని చెప్పారు. ఈ పరీక్షను తాము అధ్యయనం చేస్తున్నామని, ఎవరికీ అంతరిక్షాన్ని అస్థిరపరిచే హక్కు లేదని చెప్పారు. యాంటీ శాటిలైట్ పరీక్షలతో శకలాల సమస్యను పెంచొద్దని కోరారు. ధ్వంసమైన శాటిలైట్ల శకలాల విషయమై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతరిక్షం అనేది అందరూ కలిసి స్వేచ్ఛగా పని చేసుకునేదని, అశాంతిని సృష్టించకూడదని చెప్పారు. మనమంతా అంతరిక్షంలో భాగంగానే ఉన్నామన్న ఆయన దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

మిషన్ శక్తి పై చైనా కూడా స్పందించింది. అంతరిక్షంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ విషయంలో భారత్ మాత్రమే కాకుండా.. క్షిపణి ద్వారా ఉపగ్రహాలను కూల్చివేయగల సామర్థ్యాన్ని సాధించిన అన్ని దేశాలు కూడా అంతరిక్షంలో శాంతిని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.