కొడుకుల బ్యాగుల్లో శానిటరీ ప్యాడ్స్ పెడుతున్న తల్లి..ఎందుకో తెలిస్తే ఆ అమ్మకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

కొడుకుల బ్యాగుల్లో శానిటరీ ప్యాడ్స్ పెడుతున్న తల్లి..ఎందుకో తెలిస్తే ఆ అమ్మకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

us Mom sons bags to carry sanitary pads : అమెరికాకు చెందిన ఓ తల్లి తన ఇద్దరు కొడుకుల బ్యాగుల్లో ఎప్పుడూ శానిటరీ ప్యాడ్స్ పెడుతుంటుంది. కొడుకుల బ్యాగుల్లో ఏమి ఉన్నా లేకపోయినా..ఆఖరికి లంచ్ బాక్సులు లేకపోయినా శానిటరీ ప్యాడ్స్ మాత్రం ఎప్పుడూ పెట్టటం మాత్రం మానదు ఆ తల్లి..రాను రాను తన కొడుకులకు బ్యాగుల్లో శానిటరీ ప్యాడ్స్ పెట్టుకోవటం అలవాటు చేసింది. అలా ఎందుకు చేయాలో తమ బ్యాగుల్లో శానిటరీ ప్యాడ్స్ ఎందుకో కూడా వివరంగా చెప్పింది.

అది అర్థం చేసుకున్న ఆ ఇద్దరు మగపిల్లలు ‘అమ్మమాట’ను ఎప్పుడూ జవదాటరు. తమ బ్యాగుల్లో తినటానికి ఏమీ పెట్టుకోకపోయినా..శానిటరీ ప్యాడ్స్ పెట్టుకోవటం మాత్రం మానరు. ఈ ‘‘పవిత్ర కార్యం వెనుక అమ్మ నేర్పించిన బలమైన..స్ఫూర్తినిచ్చే పాఠాలు’’ఉన్నాయి మరి. మగపిల్లలకు శానిటరీ ప్యాడ్స్ ఎందుకు? అనుకుని నవ్వుకోవచ్చు..కానీ ఆ పవిత్ర కార్యం వెనుక దాగున్న ఆ మాతృమూర్తి ఆలోచన ఏంటో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పి తీరుతారు…!!


వాళ్లిద్దరూ అన్నదమ్ములు. వాళ్ల బ్యాగులో లంచ్ బాక్స్ ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వస్తువులు మాత్రం ఉంటాయి. అవే.. శానిటరీ ప్యాడ్స్, టాంపోన్స్ (తడిని పీల్చుకునే దూది). ఆ విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా వారి స్నేహితురాళ్లకు. ఆపద వస్తే ఆ అమ్మాయిలు నిర్మొహమాటంగా వారి సాయం తీసుకుంటారు. కట్టుబాట్లను చెరిపేసిన పవిత్ర కార్యమది.

అలాగని అంతతేలిగ్గా వచ్చిదనుకుంటే పొరపాటే. ఆ కార్యం నిర్వహించే క్రమంలో ఆ సోదరులిద్దరూ మొదట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్నేహితులు వారిని గేలి చేశారు. అయినా.. మౌనంగా భరించారు. ఎందుకంటే వారిని ముందుకు నడిపించింది ‘అమ్మ మాట’. ఆ మాతృమూర్తి ఆలోచన ఏంటో తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారు! అమెరికాకు చెందిన ఆ అమ్మ పేరు తారా అహ్రెన్స్. ఆమెకు ఇద్దరు కొడుకులు,10 ఏళ్ల కూతురు ఉన్నారు. ఒకరోజు ఆమె.. టీనేజ్‌కు వచ్చిన తన కొడులిద్దరినీ పిలిచి అద్భుతమైన విషయం చెప్పింది. ఏ కొడుకుల దగ్గరా ఏ తల్లీ మాట్లాడని విషయం అది..!!

ఆ తల్లి కొడుకులకు చెప్పిన మాటలివి..‘ఇకపై మీ బ్యాగులో ఎప్పుడూ శానిటరీ ప్యాడ్స్ ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి..మీ ఫిమేల్ (ఆడపిల్లలు)ఫ్రెండ్స్‌ ఏ సమయంలోనైనా ఇబ్బంది రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు వారికి సహాయంగా ఉండాలి. దానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇక నుంచీ మీ బ్యాగుల్లో ఏమి ఉన్నా లేకపోయినా..శానిటరీ ప్యాడ్స్ ఉండేలా చూసుకోవాలని తన ఇద్దరు కొడుకులైన మైకా, ఎలిజాకు చెప్పిందా తల్లి…!!

ఆడపిల్లగా పుట్టిన ప్రతీవారికి ప్రతీ నెలా రుతుస్రావం (బహిష్టు) అనేది ఓ సహజ ప్రక్రియ. అది ప్రకృతి ధర్మం. ఈ కంప్యూటర్ కాలంలో ఎంతగానో డెవలప్ అయిన ఆడపిల్లలు కూడా దీని గురించి బహిరంగంగా మాట్లాడరు. అదొక సీక్రెట్ విషయంగానే చూస్తారు. దాని గురించి పబ్లిగ్గా మాట్లడకపోవడం వల్ల నష్టం జరుగుతోంది. చాలా మంది అమ్మాయిలు క్లిష్ట సమయాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ఏమాత్రం బైటకు చెప్పుకోరు. కనీసం మాట్లాడరు. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఆ హద్దులను చెరిపేయాలి. అని ఆ తల్లి తన ఇద్దరు కొడుకులను దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పింది.

తల్లి మాటల్ని శ్రద్ధగా విని అర్థం చేసుకున్న మైనర్లు అయిన మైకా, ఎలిజాలకు తల్లి మాటలు వింతగా తోచింది. కానీ..తల్లి మాటల్లో ఎంత నిజముందో ఓ రోజు ప్రత్యక్షంగా అర్థమైంది వారికి. ఒకరోజు ఎలిజా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయి పబ్లిక్ ప్లేస్‌లో అకస్మాత్తుగా రుతుస్రావం కావడంతో బాగా ఇబ్బంది పడింది. ఆ విషయం తెలిసిన ఆ యువకులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక అక్కడ నుంచి వాళ్లు తమ బ్యాగుల్లో లంచ్ బాక్స్ ఉన్నా, లేకున్నా.. శానిటర్ ప్యాడ్స్ మాత్రం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తపడుతున్నారు.

తమలాగా మిగతా మగపిల్లలు కూడా ఆలోచించాలని అనుకున్న ఎలిజా వారి స్నేహితులకు చెప్పాడు. తమ బ్యాగులో శానిటరీ ప్యాడ్స్ క్యారీ చేస్తానని చెప్పగా..అలాగే ఆడపిల్లలకు కూడా ఓపెన్ గా చెప్పారు. అది విన్న కొంతమంది ఫ్రెండ్స్ వారిని వింతగా చూశారు. హేళన చేశారు. టీజ్ చేశారు.

అదేసమయంలో ఎక్కువ మంది ఎలిజా మంచి మనసుకు ఫిదా అయ్యారు.మీ మమ్మీకి చాలా గొప్పదిరా అంటూ అభినందించారు. అలాగే ఎలిజా చెప్పే మాటలు విన్న మొదట్లో అమ్మాయిలు కూడా ఇబ్బందిపడ్డారు. కానీ రాను రాను నిర్మొహమాటంగా అతడి నుంచి సాయం తీసుకుంటున్నారు. అవసరమైనప్పుడు శానిటరీ ప్యాడ్స్ తీసుకుంటున్నారు. నువ్వు చాలా మంచి ఫ్రెండ్ వి చాలా ‘అవరసరం’ తీర్చే బెస్ట్ ఫ్రెండ్ వి అని ధన్యవాదాలు చెప్పుకునేవారు. అలా అలా ఆ ఇద్దరు మగపిల్లల దగ్గర సాన్నిహిత్యం కూడా పెరిగింది. వాళ్ల అమ్మ కోరుకుంది కూడా అదే కదా..! ఆమె అనుకున్నట్లుగానే ఆడపిల్లల అవసరం తీర్చే పిల్లలుగా తయారయ్యారా మగపిల్లలు..

మరి రొడేరేలరే ఇంత మంచి అలవాట్లు తయారు చేసిన ఆ తల్లి గురించి తెలుసుకోవటం మన బాధ్యత..తారా అహ్రెన్ అభ్యుదయ భావాలు గల మహిళ. సమాజంలో ఆడ, మగ అనే తేడా ఉండకూడదని కోరుకునే స్ఫూర్తినిచ్చే మహిళ. పిల్లలకు చిన్నప్పటినుంచి ఆ విషయాన్ని తెలిసేలా పెంచాలంటారామె.

ముఖ్యంగా సున్నితమైన విషయాల గురించి విడమరిచి వారికి అర్థం అయ్యేలా చెప్పాలంటారు. దాని వల్ల ఆడపిలలను గౌరవంగా చూడటం తద్వారా ఆరోగ్యకరమైన సమాజం నెలకొంటుందని నమ్ముతారు తారా అహ్రెన్. దీని వల్ల మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, హింస తగ్గుతాయని తారా చెబుతారు.

కాగా తారా తన బ్లాగులో పలు అవగాహన వ్యాసాలు రాస్తుంటారు. ‘మహిళల్లో రుతుస్రావం గురించి..మగపిల్లలు..ఆడపిల్లలకు తెలియజెప్పాల్సిన విషయాల గురించి రాస్తుంటారు. రుతు స్రావం గురించి పబ్లిగ్గా మాట్లడకపోవడం వల్ల నష్టం జరుగుతోందనీ..చాలా మంది అమ్మాయిలు ఒత్తిడికి గురవుతున్నారని..ఆ హద్దులను చెరిపేయాలి. అందరికీ ప్రేమను పంచాలి’ అంటూ తారా తన బ్లాగ్‌లో రాస్తుంటారు.

ఇలాంటి విషయాల గురించి ఇతరులకు చెప్పడమే కాదు, తారా స్వయంగా ఆచరించి చూపిస్తారు. పదేళ్ల తన కుమార్తెకు తొలిసారిగా బ్రా కొనాల్సి వచ్చినప్పుడు తన కుమారులిద్దరినీ షాపింగ్‌కు తీసుకెళ్లారు. వాళ్ల ముద్దుల చెల్లెలికి వారి చేతుల మీదుగానే ఇన్నర్‌వేర్ కొనే అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన బ్లాగ్‌లో షేర్ చేసుకున్నారు. ‘యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల్లో ఎద భాగం పెరగడం కూడా సహజ ప్రక్రియే’ అని ఆమె రాసుకొచ్చారు.