సరదాగా 94మంది మహిళల్ని చంపేశాడు..సీరియల్ కిల్లర్ మారణకాండ..

  • Published By: nagamani ,Published On : December 4, 2020 / 04:36 PM IST
సరదాగా 94మంది మహిళల్ని చంపేశాడు..సీరియల్ కిల్లర్ మారణకాండ..

USA serial killer undetected least 40 years : చాకుతో పండ్లు కోసుకుని తిన్నంత ఈజీగా మనుషుల్ని చంపేస్తాడతను. అరెస్ట్ అవ్వటం..జైలునుంచి విడుదల కావటం ఆ హంతకుడికి కొత్తకాదు. అత్తారింటికి వెళ్లి వచ్చినంత ఈజీగా జైలుకెళ్లి వచ్చేస్తుంటాడు. డ్రగ్‌ కు బానిసైనవాళ్లు, సెక్స్‌ వర్కర్లు, ఒంటరి మహిళలు, ఎవరూ లేని అనాథలు అతని టార్గెట్. 13 ఏళ్ల వయస్సులో దొంగతనాలకు అలవాటు పడిన ఆ సైకో కిల్లర్ కు ఇప్పుడు 80 ఏళ్లు.



కానీ నల్లగా దృఢమైన శరీరంతో అంత వయస్సు ఉన్నట్లుగా కనిపించడు. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌గా పేరొందిన ఆ హంతకుడి పేరు సామ్యూల్ లిటిల్‌. అలా 1970 నుంచి 2005 వరకూ 19 రాష్ట్రాల్లో మొత్తం 93మంది మహిళల్ని హత్య చేశాడు. సీరియల్ హత్యలతో సామ్యూల్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అతన్ని మీడియా ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు అడిగినా ఇచ్చేవాడుకాదు. కానీ కొన్ని రోజుల క్రితం సామ్యూల్ ఇటీవల ఓ వీడియోలో తను చేసిన హత్యల గురించి చెప్పటంతో విన్నవారికి వెన్నులోంచి వణుకు వచ్చింది. దీంతో సామ్యూల్ మరోసారి వార్తల్లోకొచ్చాడు.


సామ్యూల్ చేసిన హత్యల వివరాల్లోకి వెళితే.. 1970నాటి ఘటన..సామ్యూల్ కు 30 ఏళ్లు. అతను చేసిన తొలి హత్య గురించి.. అప్పటికే బాగా చీకటిపడింది. అది మియామీలో రూట్‌ 27కు దగ్గరలో నిర్మానుష్యమైన ప్రదేశంలో కారును ఆపేశాడు సామ్యూల్‌ లిటిల్‌. అప్పటికే మెడలో ధగధగా మెరిసిపోతున్న నెక్లెస్ తో ఉన్న మేరీ బ్రోస్లే అనే మహిళతో పరిచయం ఏర్పరుచుకుని కారులో తీసుకొచ్చాడు. ఆమె ఎంజాయ్ మెంట్ ను ఇష్టపడుతుందని తెలుసుకున్నాడు. మద్యం తాగటం..ఇష్టమైనట్లుగా తిరగటం, తనకు ఇష్టమైంది ఫుల్ గా లాగించేయటం,నచ్చినవారితో సరదాగా గడపటం అంటే ఆమెకు ఇష్టం. ఆ అలవాట్లు మానుకోమన్న కుటుంబం నుంచి బైటకు వచ్చేసింది.



అటువంటి సరదాలున్న మేరీతో పరిచయం చాలా ఈజీగా అయిపోయింది సామ్యూల్ కు. సరదా సరదా మాటలతో మేరీని ఆకట్టుకున్నాడు. సామ్యూల్ చెప్పే జోకులన్నా..వింత వింత మాటలన్నా మేరీకి చాలా ఇష్టం. 80 పౌండ్ల బరువుతో మేరీ కాస్త పొట్టిగా ఉన్నా..చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. అలా మేరీతో మంచి స్నేహం కుదిరింది. ఓ రోజు మేరీ,సామ్యూల్ అలా కారులో తిరుగుతూ మియామీలోని రూట్ 27కు వచ్చారు. మేరీ మెడలో ధగధగా మెరిసిపోతున్న నెక్లెస్ ను సామ్యూల్ చూశాడు. దాన్ని చూస్తుంటే సామ్యూల్ కు దాన్ని సొంతం చేసుకోవాలనే కోరిక పెరిగిపోతోంది. దీంతో కుదురుగా ఉండలేకపోతున్నాడు. మెల్లగా మేరీని దగ్గరకు తీసుకున్నాడు.



అలా జరిగిన తరువా ఆమె ఎడమ చేతిని గమనించాడు. ఆమెకు చిటికిన వేలు లేదు. వంట చేస్తున్న చేస్తున్న సమయంలో వేలు తెగి పడిపోయిందని చెప్పింది. అలా ఇద్దరూ కారులో సరదాగా గడుపుతున్న సమయంలో తనకు ఎవరూ లేరని, ఒంటరిదాన్నని చెప్పింది. ఆ మాట సామ్యూల్ కు బాగా నచ్చింది. మేరీని ఏం చేసినా అడిగేవారు లేరని నిర్ధారించుకున్నాడు. మేరీ మెడలో ధగధగా మెరిసిపోతున్న నెక్లెస్ నుంచి సామ్యూల్ కళ్లు తిప్పుకోలేకపోతున్నాడు. పచ్చని పసిమి ఛాయతో మెడకు పెయింట్ వేసినట్లుగా అమరిపోయిన నెక్లెస్‌ సామ్యూల్‌ను బాగా ఆకర్షించింది. అతడిలో దాగున్న రాక్షసుడు నిద్రలేచాడు.



ఇంక లేట్ ఎందుకు పనికానిచ్చేద్దాం అనుకున్నాడు. చుట్టుపక్కల చూశాడు. జనసంచారమే లేదు. ఇక కంట్రోల్ చేసుకోలేకపోయాడు.అంతే ఒక్కసారిగా మేరీ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా గొంతు నులిమేటం ప్రారంభించాడు. సామ్యూల్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న మేరీ ఈ హఠాత్పరిణామానికి కంగుతింది. ఆశ్చర్యంగా సామ్యూల్ ని చూస్తుండిపోయింది. సామ్యూల్ పెద్దగా కష్టపడికుండా మేరీ గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. 1970 నాటి ఘటన ఇది. అప్పటికి సామ్యూల్‌కు 30 ఏళ్లు. మేరీకి 33. సైకో కిల్లర్‌ సామ్యూల్‌ బారిన పడ్డ మొదటి బాధితురాలు మేరీ. అలా మేరీ తర్వాత 93 మంది మహిళలను అలాగే చంపేశాడు సామ్యూల్‌.



వారిలో ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా ఉంది. ముప్పై ఏళ్లలో 19 రాష్ట్రాల్లో అతడు చేసిన ఘాతుకాలకు హద్దులేకుండాపోయింది. ఇన్ని దారుణాలు చేసిన ఎక్కడా కూడా తన వేలిముద్రలు గానీ, ఏ సాక్ష్యాధారాలేవీ చిక్కకుండా జాగ్రత్తపడేవాడు. డ్రగ్‌ బానిసైనవారు, సెక్స్‌ వర్కర్లు, ఒంటరి మహిళలు, అనాథ మహిళలే సామ్యూల్ టార్గెట్. నల్లజాతి మహిళలైతే మరీ మంచిది. ఎందుకంటే వాళ్లను ఏం చేసినా అడిగే వారు ఎవరూ ఉండరనే ధైర్యం.



హత్యలల్లో సాక్ష్యాధారాలు దొరక్క పట్టుబడేవాడు కాదు.కానీ చిన్న చిన్న దొంగతనాలు, దోపిడీలతో సామ్యూల్‌ అప్పుడప్పుడూ అరెస్ట్ అయ్యేవాడు. కానీ వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేవాడు. కానీ పోలీసులు మాత్రం అతడిపై నిఘా వేసే ఉంచారు. అలా ఒకానొక హత్య కేసులో ప్రాథమిక ఆధారాలతో 2014లో అతడిని అరెస్టు చేశారు. డీఎన్‌ఏ టెక్నాలజీని ఉపయోగించి నేరాన్ని రుజువు చేయడంతో స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష అంటే శిక్షలు విధించింది. అప్పటి నుంచి సామ్యూల్ కాలిఫోర్నియాలోని జైలులో సామ్యూల్‌ శిక్ష అనుభవిస్తున్నాడు.



అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌గా పేరొందాడు సామ్యూల్‌. ఇతని కేసుకు సంబంధించిన వివరాలతో పాటు అతడి గతం గురించి తెలుసుకోవాలని మీడియాలు ఇంటర్వ్యూ అడిగాయి. కానీ సామ్యూల్ ఎవ్వరికి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు. కాగా..ఇటీవల సామ్యూల్ ఏకంగా 700 గంటల వీడియోటేప్‌ బైటపడటంతో సామ్యూల్ చేసిన దారుణాల్ని తెలిసాయి. పోలీసులతో సామ్యూల్‌ చేసిన నేరాల చిట్టాలు చెబుతుంటే వాళ్లు రికార్డు చేశారు. అతను హత్యలు చేసిన విధానం ఒళ్లు గగుర్పొడిచే విషయాల గురించి స్థానిక మీడియా పేర్కొంది.



దారుణ నేరస్థుడిగా మారిన సామ్యూల్ గతం..
దక్షిణ అట్లాంటాకు 100 మైళ్ల దూరంలో గల రెనాల్డ్స్‌(జార్జియా)లో 1940, జూన్‌ 7న సామ్యూల్‌ లిటిల్‌ ఓ మైనర్ బాలికకు జన్మించాడు. సామ్యూల్ పసివాడుగా ఉన్నపుడే తల్లి అతడిని బంధువుల ఇళ్లలో వదిలేసింది. అప్పటి నుంచి ఒహియోలో పెరిగిన సామ్యూల్‌కు ఒంటరితనంగా పెరిగాడు. సామ్యూల్ ఐదో తరగతిలో ఉన్నపుడు ఓ టీచర్‌ అతడిని దగ్గరకు తీసుకుని మెడమీద రుద్దుకునేదట. అతడికి అప్పటి నుంచి ఎవరి మెడను చూసినా..ముఖ్యంగా ఆడవారి మెడను గట్టిగా నొక్కిపట్టాలని, గొంతు నులమాలని అనుకునేవాడట. అప్పటి నుంచి తన పక్కనే ఉన్న తోడి విద్యార్థినిని చంపడానికి అనేకసార్లు ట్రై చేశాడు. కానీ కుదర్లేదు.



ఆ తరువాత తన 13 ఏళ్ల వయస్సులో మొదటిసారి ఓ సైకిల్‌ను దొంగతనం చేశాడు సామ్యూల్. అలా మొదలైన దొంగతనాలు చేస్తూ పట్టుబడి జువైనల్‌ జైలులో జీవితం గడపాల్సి వచ్చింది. అలా నేరాల ప్రస్థానం పెరిగింది. నేరాల స్థాయి పెరిగింది. సీరియల్‌ కిల్లర్‌గా మారి ఎన్నో హత్యలు చేశాడు. ఎవరి మెడలోనైనా బంగారం కనిపిస్తే చాలా సామ్యూల్ ఆగవాడు కాదు. వాళ్లపై దాడి..తరువాత హత్య..అన్నీలాక్కుని మృతదేహాలను పొదల్లో పారేటం అక్కడినుంచి చెక్కేయటం అదే అతడి పనిగా మారింది.



తను చేసే దారుణాల గురించి సామ్యూల్ చెబుతూ..నాకు మజా దొరికిన ఏరియాలకు వెళ్లటం అంటే చాలా ఇష్టం. అక్కడకు వెళ్లి మళ్లీ మళ్లీ అదే తరహాలో హత్య చేయాలని ఉండేదని చెప్పాడు. తను చేసే హత్యల్ని పండ్లు కోసుకుని తినటంతో పోల్చాడు. ఎన్నిపళ్లు కోసుకుని తింటే అంత మజా కదా..ఆ మజా కోసం తరచూ హత్యలు చేసేవాడినని చెప్పాడు.కానీ తెల్లగా ఉండేవాళ్ల జోలికి సామ్యూల్ పెద్దగా వెళ్లేవాడు కాదు. నల్లజాతీయులే అతనికి ఎక్కువ టార్గెట్. అలా అతను చేసే మొత్తం 94 హత్యల్లో 53మంది మహిళలు నల్లజాతీయులే.



ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సున్న సామ్యూల్ హత్యల పరంపర గురించి తెలిపాడు. మేరీ బ్రెస్లీ(శ్వేతజాతి మహిళ‌), మార్తా కన్నింగ్‌హాం(బ్లాక్‌ మదర్‌), మేరీ ఆన్‌ జెంకిన్స్, జొలాండా జోన్స్‌ సహా ఎంతో మంది సామ్యూల్‌ చేతిలో హతమైనవారిలో ఉన్నారు. 1970 నుంచి 2012 మధ్య మొత్తం 94మంది మహిళల్ని చంపినట్లుగా వీడియోలో తెలిపాడు.