Mask : క్లాత్ మాస్కులు కరోనాను అడ్డుకోలేవా? ప్రమాదం తప్పదా?

వ్యాక్సిన్ వచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం మస్ట్ అని, కరోనా నుంచి కాపాడుకునే ఏకైక రక్షణ మార్గం అదేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతా సాధారణ మాస్కులతో పాటు కాస్ట్లీ మాస్కులూ వాడుతున్నారు. చాలామంది ఎక్కువసార్లు ఉపయోగించుకునేందుకు వీలుగా క్లాత్ తో(వస్త్రంతో) తయారు చేసిన మాస్కులు వాడుతున్నారు. కొంతలో కొంత సేఫ్ గా ఫీల్ అవుతున్నారు. మాస్కు వేసుకున్నాం కదా ఇక కరోనా భయం ఉండదని భావిస్తున్నారు.

Mask : క్లాత్ మాస్కులు కరోనాను అడ్డుకోలేవా? ప్రమాదం తప్పదా?

Use N95 Or Kn95 Masks

Use N95 or KN95 Masks : కరోనా సెకండ్ వేవ్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సెకండ్ వేవ్ లో వైరస్ మరింత ప్రమాదకరంగా మారింది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. మన దేశంలోనూ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా ఈ మహమ్మారి చెలరేగిపోతోంది. దీంతో కరోనాను ఎలా కట్టడి చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఏ మాస్క్ మంచిది?
కాగా.. వ్యాక్సిన్ వచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం మస్ట్ అని, కరోనా నుంచి కాపాడుకునే ఏకైక రక్షణ మార్గం అదేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతా సాధారణ మాస్కులతో పాటు కాస్ట్లీ మాస్కులూ వాడుతున్నారు. చాలామంది ఎక్కువసార్లు ఉపయోగించుకునేందుకు వీలుగా క్లాత్ తో(వస్త్రంతో) తయారు చేసిన మాస్కులు వాడుతున్నారు. కొంతలో కొంత సేఫ్ గా ఫీల్ అవుతున్నారు. మాస్కు వేసుకున్నాం కదా ఇక కరోనా భయం ఉండదని భావిస్తున్నారు.

క్లాత్‌తో చేసిన మాస్కులు వాడకూడదా?
అయితే, క్లాత్ తో తయారు చేసిన మాస్కులతో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. క్లాత్ తో చేసిన మాస్కులకంటే N-95 లేదా KN-95 మాస్కులు వాడటం చాలా మంచిదని అమెరికా మేరీలాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫహీమ్ యూనస్ చెప్పారు. రెండు ఎన్-95 లేదా కెఎన్-95 మాస్కులు కొని.. ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగ్ లో ఉంచి మరుసటి రోజు వాడాలని సూచించారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చని వివరించారు. క్లాత్ తో చేసిన మాస్కులు వాడకపోవడమే మంచిదని ఆయన అన్నారు.

దీంతో మాస్కుల విషయంలో మళ్లీ గందరగోళం మొదలైంది. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుండటంతో జనాలు వర్రీ అవుతున్నారు. అసలు, ఎలాంటి మాస్క్ మంచిది అనేది తెలియక నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

ఒకటి కాదు.. రెండు పెట్టుకోండి..
ఇది ఇలా ఉంటే, గాలి ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న స్టడీస్ జనాలను మరింత కలవరపెడుతున్నాయి. దీనిపై ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ బారినపడకుండా ఉండేందుకు ఎన్95 మాస్కును సరిగ్గా ధరించాలని.. క్లాత్, సర్జికల్ మాస్కులు వాడేవారు.. 2 మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. అయితే, మాస్కులు నోరు, ముక్కును పూర్తిగా కవర్ చేయాలన్నారు.