B.1.617 వేరియంట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న అమెరికా వ్యాక్సిన్లు

యునైటెడ్ స్టేట్స్ ఆమోదించిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కోవిడ్ -19 వ్యాక్సిన్లు భారతదేశంలో ప్రధానంగా

B.1.617 వేరియంట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న అమెరికా వ్యాక్సిన్లు

Vaccines Approved By Us Work Against B1617 Variant

B1617 : యునైటెడ్ స్టేట్స్ ఆమోదించిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కోవిడ్ -19 వ్యాక్సిన్లు భారతదేశంలో ప్రధానంగా ఉన్న వైరస్ B.1.617 వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావాన్ని కలిగి ఉన్నాయి.. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కాలిన్స్ వెల్లడించారు.. ప్రస్తుతం డేటా ప్రకారం యుఎస్ ఆమోదించిన వ్యాక్సిన్లు B.1.617 అని పిలువబడే ఈ వేరియంట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుండటం చాలా ప్రోత్సాహకరంగా ఉందని ఆయన అన్నారు.

ఈ వేరియంట్‌ కు.. పై వ్యాక్సిన్లు ఉపయోగించడం ద్వారా కొంతమందికి తక్కువ ప్రభావమే చూపించవచ్చు.. కానీ అమెరికన్లను రక్షించేలా చేయడానికి ఇవి సరిపోతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ వారం ప్రారంభంలో భారతదేశంలో మొట్టమొదట కనుగొనబడిన B1617 SARS-CoV-2 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీనివల్లే కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.