Covid Vaccines: కొవిడ్-19పై పోరాడేందుకు నేచురల్ ఇమ్యూనిటీ ఇచ్చేవే వ్యాక్సిన్లు

కొవిడ్-19పై పోరాడేందుకు వ్యాక్సిన్లు నేచురల్‌గానే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయని ఓ స్టడీలో వెల్లడైంది. ఎమర్జింగ్ వేరియంట్ల నుంచి కాపాడుకునేందుకు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయి.

Covid Vaccines: కొవిడ్-19పై పోరాడేందుకు నేచురల్ ఇమ్యూనిటీ ఇచ్చేవే వ్యాక్సిన్లు

Covid Vacines

Covid Vaccines: కొవిడ్-19పై పోరాడేందుకు వ్యాక్సిన్లు నేచురల్‌గానే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయని ఓ స్టడీలో వెల్లడైంది. ఎమర్జింగ్ వేరియంట్ల నుంచి కాపాడుకునేందుకు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయి. అమెరికాలోని రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ రీసెర్చర్లు కొవిడ్ పేషెంట్ల రక్త నమూనాలు సేకరించి యాంటీబాడీలు పరీక్షించారు.

స్టడీలో పాల్గొన్న 63మంది డేటాను రివ్యూ చేసేసరికి.. యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లుగా తెలిసింది. ఇమ్యూన్ సిస్టమ్ మెమెురీ బీ సెల్స్ యాంటీబాడీలు ప్రొడ్యూస్ చేస్తూ SARS-CoV2ను కంట్రోల్ చేసేందుకు తోడ్పడుతున్నాయి.

ఈ మెమొరీ బీ సెల్స్ అనేవి ఇమ్యూన్ రిజర్వాయర్ లా ప్రవర్తించి యాంటీబాడీలను కలెక్ట్ చేస్తున్నాయి. ఈ స్టడీలో ఇంప్రూవ్ అయిన వాళ్లందరిలోనూ యాంటీబాడీలు డెవలప్ అయినట్లు స్పష్టం అయింది. దీనిని బట్టి రీసెర్చర్లు ఓ అవగాహనకు వచ్చారు.

26 మందికి మోడర్నా లేదా ఫైజర్ నుంచి ఒక్క డోసును ఇచ్చారు. వారిలో SARS-CoV2వేరియంట్లతో పోరాడేందుకు సరిపడా యాంటీబాడీలు ఉత్పత్తి అవడాన్ని గమనించారు. వారందరినీ యూకే, సౌతాఫ్రికా, న్యూయార్క్ లలో ఐసోలేషన్ లో ఉంచారు.

ఈ స్టడీని బట్టి ప్రస్తుత వ్యాక్సిన్లు వైరస్ సోకనివారికి అదనపు రక్షణ కింద యాంటీబాడీలు బూస్టింగ్ చేసేందుకు హెల్ప్ అవుతున్నాయని నిర్ధారణకు వచ్చారు.