గెలిచిన జట్టుకు శవపేటిక గిఫ్ట్ గా ఇస్తారంట!

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 07:22 AM IST
గెలిచిన జట్టుకు శవపేటిక గిఫ్ట్ గా ఇస్తారంట!

మనం చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఆటల పోటీల్లో గెలిస్తే ఏ గ్లాసో,స్టీల్ గిన్నో ఇచ్చేవారు.ఇప్పుడైతే కార్పొరేట్ చదువులు కాబట్టి ఓ షీల్డ్ మెడల్ ఇస్తున్నారు.మహా అయితే ప్రైజ్ మనీ కూడా ఇస్తారు.అయితే పెరూలోని జూలియాకా పట్టణంలో ప్రపంచంలోనే ఎక్కడా కనీవినీ ఎరుగని బహుమతి అందజేస్తారు.అక్కడ ఏటా జరిగే ఫుట్ బాల్ టోర్నీలో శవపేటికను గెలిచిన జట్టుకు బహుమతిగా ఇస్తారు.దాదాపు 1లక్ష రూపాయల విలువైన శవపేటికను గెలిచిన టీమ్ కు బహుమతిగా ఇస్తారు.రెండు,మూడు స్థానాల్లో నిలిచిన వారికి అంతకన్నా తక్కువ ఖరీదుగల శవపేటికను ఇస్తారు.ఈ పోటీల్లో 12 జట్లు హోరాహోరీగా తలపడి చివరకు శవపేటికను తీసుకెళ్తారు.జట్టు సభ్యులు భుజాలపై శవపేటికను భుజాలపై పెట్టుకుని పాటలు పాడుకుంటూ గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ కొడతారు