Vegan Dinosaur: డైనోసార్లు వెజిటేరియన్లా.. జపాన్ లో కనిపించిన శిలాజాలు చెప్తున్నాయేంటంటే..

'పారాలిథెరిజినోసారస్ జపోనికస్' అనే డైనోసార్ జాతి సుమారు 72 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియస్ యుగంలో భూమిపై నివసించిందని రిపోర్టులు చెబుతున్నాయి. థెరిజినోసౌరిడే అని పిలువబడే చిన్న నుంచి పెద్ద శాకాహార థిరోపాడ్ డైనోసార్ల జాతికి చెందినదిగా పోల్చారు.

Vegan Dinosaur: డైనోసార్లు వెజిటేరియన్లా.. జపాన్ లో కనిపించిన శిలాజాలు చెప్తున్నాయేంటంటే..

Diinosuar

 

 

Vegan Dinosaur: జపాన్‌లోని హక్కైడోలో రీసెంట్‌గా కనిపించిన శిలాజాలు డైనోసార్లు వెజిటేరియన్లు, మొక్కలు లాంటివి తినేవని వెల్లడిస్తున్నాయి. ‘పారాలిథెరిజినోసారస్ జపోనికస్’ అనే డైనోసార్ జాతి సుమారు 72 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియస్ యుగంలో భూమిపై నివసించిందని రిపోర్టులు చెబుతున్నాయి. థెరిజినోసౌరిడే అని పిలువబడే చిన్న నుంచి పెద్ద శాకాహార థిరోపాడ్ డైనోసార్ల జాతికి చెందినదిగా పోల్చారు.

జపాన్‌లోని ఉత్తర, వాయువ్య ప్రాంతాల నుంచి పరిశోధకులు మరో రెండు జాతులను కూడా కనుగొన్నారు. థెరిజినోసార్ల ఫ్రాగ్మెంటరీ శిలాజాలు జపాన్ లో కనిపించినప్పటికీ ఈ డైనోసార్ల వర్గీకరణ స్థితి ఇప్పటికీ పరిష్కరించబడలేదని రీసెర్చర్లు వెల్లడించారు.

దాదాపు 23 మిలియన్ సంవత్సరాల నుంచి 5.3 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు విస్తరించిన మియోసిన్ యుగంలో, క్రెటేషియస్ కాలంలో ఆసియా ఖండం తూర్పు భాగంగా ఇటువంటి శిలాజాలు కనుగొన్నట్లు వారు తెలిపారు.

Read Also: 7 కోట్ల ఏళ్ల నాటి డైనోసర్ గుడ్డు..శిలాజంలో ఎదిగిన పిండం

రీసెర్చర్లు తెలిపిన వివరాల ప్రకారం, శిలాజాల అవయవాలు, గోళ్లలో విభిన్న లక్షణాలు కలిగి ఉన్నాయి. జపాన్ లో కనిపించిన అతి చిన్న వయస్సుదైన థెరిజినోసార్, ఆసియాలోని సముద్ర నిక్షేపాలలో కోలుకున్న మొదటిది అని కూడా వివరించారు.

“జపాన్ లో కనిపించిన శిలాజ ప్రకారం.. దాని దంతం, బ్రెయిన్ కేస్, ఆధారంగా.. అది వెజిటేరియన్ గా చెప్పొచ్చు. వీటి ఉనికి సుదీర్ఘ కాలం కొనసాగినట్లు తెలుస్తోంది. ఇవి తీరప్రాంత వాతావరణాల్లో ఎక్కువగా కనిపించేవని సూచిస్తుంది” అని స్పష్టమైంది.