baby sand,Rocks : పసిబిడ్డకు మట్టి, రాళ్లు తినిపిస్తూ..వీడియో తీసి Tik Tok లో పోస్ట్ చేస్తున్న తల్లి..

చంటిబిడ్డలు మట్టి తింటుంటే తల్లులు వారిస్తారు. కానీ ఓ తల్లి మాత్రం తన 8 నెలలు పిల్లాడితో కావాలనే మట్టి, రాళ్లు, పుల్లలు తినిపిస్తోంది. అలా ఆ పిల్లాడు అన్ని తింటుంటే వీడియోలు తీసి వాటిని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తోంది. దానికి ఆ తల్లి ఏం చెబుతుందంటే..

baby sand,Rocks : పసిబిడ్డకు మట్టి, రాళ్లు తినిపిస్తూ..వీడియో తీసి Tik Tok లో పోస్ట్ చేస్తున్న తల్లి..

8 Months Baby Chew Sand,rocks,lick Shopping

baby sand, rocks shopping : చిన్నపిల్లలు తెలిసీ తెలియక మట్టి, సుద్ద,కచ్చికలు తింటుంటారు. బిడ్డ అవి తినటం చూస్తే తల్లి కంగారుపడుతుంది. అలా తినకూడదని బుజ్జగించి చెబుతుంది. అయినా వినకపోతే భయపెట్టి మరీ ఆ అలవాటు మాన్పిస్తుంది. ఎందుకంటే అటువంటివి తింటే పిల్లలకు అనారోగ్యం వస్తుంది కాబట్టి. కానీ ఓ తల్లి మాత్రం ఫుల్ డిఫరెంట్, తన బిడ్డ మట్టిగడ్డలు, ఇసుక, బురద,పుల్ల ముక్కలు తింటుంటే వారించటంలేదు సరికదా?.ఆ బిడ్డ మట్టి తింటుంటే దాన్ని సరదాగా వీడియోలు తీసి తన టిక్ టాక్ లో పోస్ట్ చేస్తోంది. ఆ వీడియోలకు ఎన్నో వ్యూస్ వస్తున్నాయి. కొంతమంది తిడుతూంటే..మరికొంతమంది మరోలా అంటున్నారు.

5

 

అమెరికాలోని ఆరిజోనాలో నివసిస్తున్న అలీస్ బెండర్ అనే 22 ఏళ్ల మహిళకు ఎనిమిది నెలలు వయస్సున్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు మట్టి, ఇసుక, రాళ్లు, బురద తింటున్నాడు. కానీ అలీస్ మాత్రం ఇలా తిను..అలా తిను. అది తిను..ఇది తిను అని చెప్పి మరీ వీడియోలు తీస్తోంది. ఇదేదో ఆ తల్లికి తెలియక చేయట్లేదు.

1

ఆ పిల్లాడు తల్లి ఎదురుగానే అవన్నీ తింటున్నాడు.  అయినా ఆమే ఏమాత్రం పట్టించుకోదు. పైగా అవన్నీ తన ఫోన్ ల్లో వీడియో తీస్తోంది. ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేస్తోంది. ఆ వీడియోలకు వ్యూస్ వెల్లువలా వస్తున్నాయి. అలా సుమారు 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.

4

పిల్లలు అలాంటి తినడం ప్రమాదకరమని ఎవరన్నా చెబితే ఆమే ఏం చెబుతుందో తెలుసా..‘‘నా బిడ్డడు నా చనుబాలు తాగి పెరిగాడు. వాడు ఏం తిన్నా ఏమీ కాదు. తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డలో రోగ నిరోధక శక్తిని బాగా ఉంటుంది. అందుకే..నా పిల్లాడు ఏం తిన్నా నేను బయపడను..భయపడాల్సిన అవసరం లేనే లేదు..అందుకే బిడ్డకు ఏది ఇష్టమో అది తినేందుకు ప్రోత్సహిస్తున్నాను..’’ అంటోంది.

102

పైగా అలీస్ ఇంకా ఏమంటోందంటే..‘నేను బ్యాక్టీరియాకు భయపడను. దాన్ని ఆహ్వానిస్తాను. నేను ప్రకృతిని.. నా బిడ్డ ప్రకృతితో కలిసి పెరగాలని అనుకుంటున్నాను.పిల్లలు సూక్ష్మజీవుల మధ్యనే ఉంచాలి’’ అంటోంది. అయితే నెటిజనులు ఆమెను తిట్టిపోస్తు..‘‘నీ మూర్ఖత్వంతో బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదంగా మారతున్నావని తిట్టిపోస్తున్నారు.

10