స్టోరీ ATMలు ఇవి : బటన్ నొక్కితే చాలు.. నచ్చిన కథ వచ్చేస్తోంది

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇదే అందరి ప్రపంచం.. ఇంట్లో.. ఆఫీసుల్లో.. బస్సు స్టేషన్లలో, రోడ్లపై.. ఎక్కడ ఉన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. ఎవరిని చూసినా స్మార్ట్ ఫోన్లతో బిజీగా కనిపిస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : April 30, 2019 / 10:31 AM IST
స్టోరీ ATMలు ఇవి : బటన్ నొక్కితే చాలు.. నచ్చిన కథ వచ్చేస్తోంది

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇదే అందరి ప్రపంచం.. ఇంట్లో.. ఆఫీసుల్లో.. బస్సు స్టేషన్లలో, రోడ్లపై.. ఎక్కడ ఉన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. ఎవరిని చూసినా స్మార్ట్ ఫోన్లతో బిజీగా కనిపిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇదే అందరి ప్రపంచం.. ఇంట్లో.. ఆఫీసుల్లో.. బస్సు స్టేషన్లలో, రోడ్లపై.. ఎక్కడ ఉన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఎవరిని చూసినా స్మార్ట్ ఫోన్లతో బిజీ. స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ లో ముఖం పెట్టి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటారు. తిండి తినకపోయిన పర్వాలేదు కానీ.. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కాసేపు చూడకుండా ఉండలేరు. మరికొందరైతే స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ తో గంటల కొద్ది ఆడేస్తుంటారు. కాసేపు.. ఏదైనా మంచి పుస్తకం చదవాలని ఎవరికి అనిపించదు. అసలు తీరిక ఉంటే కదా. అస్తమానం స్మార్ట్ ఫోన్ లోనే. ఇంకెక్కడ తీరిక ఉంటుంది చెప్పండి.
Also Read : కడుపా..కండోమ్స్ మడుగా!: 80 మింగేశాడు

అందుకే ఈ స్మార్ట్ ఫోన్లకు స్వస్తి చెప్పి.. బుక్స్ వైపు దృష్టి మరల్చేందుకు ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే.. వెండింగ్ మిషన్స్ టెక్నిక్. ఇదేంటీ.. వెండింగ్ మిషన్లలో బుక్స్ రీడింగ్ ఏంటీ అనుకుంటున్నారా? అవును.. ఈ వెండింగ్ మిషన్లలో షార్ట్ స్టోరీలు ఉంటాయి. సాధారణ వెండింగ్ మిషన్లలో ఇచ్చినట్టు చాకెలెట్ కార్లు, డ్రింక్స్ ఉండవు. ఇందులో.. వర్జినీయా ఉల్ఫ్, చార్లేస్ డికెన్స్ బుక్స్ తో పాటు.. క్రైం, ఫీల్ గుడ్ ఫిక్షన్ వంటి ఇంట్రెస్టెడ్ స్టోరీలు ఉంటాయి.

బటన్ టచ్ చేస్తే చాలు.. ఫ్రీగా ఫ్రింట్ ఔట్ :
ఈ వెండింగ్ మిషన్లపై బటన్ టచ్ చేస్తే చాలు.. మీకో స్లిప్ రూపంలో.. ఫ్రింట్ ఔట్ బయటకు వస్తుంది. ఆ స్లిప్ పై.. ఆసక్తికరమైన స్టోరీలను హాయిగా చదువుకోవచ్చు. రోడ్ల పక్కన అమర్చిన ఈ వెండింగ్ మిషన్ల నుంచి స్టోరీలను ఫ్రింట్ తీసుకుని చక్కగా చదువుకోవచ్చు. మంచి టైంఫాస్ గా ఉంటుంది కూడా. కెనరీ వ్రాఫ్ ఎస్టేట్ సంస్థ షార్ట్ స్టోరీ వెండింగ్ మిషన్లను లండన్ లో ఏర్పాటు చేశారు. నిజానికి ఈ ఐడియా షార్ట్ ఎడిషన్, ఫ్రెంచ్ కు చెందిన బ్రెయిన్ చైల్డ్ కంపెనీది. ఇలాంటి వెండింగ్ మిషన్లను ఫ్రాన్స్, హాంకాంగ్, అమెరికాలో ఏర్పాటు చేశారు.

ఈ స్టోరీలు పూర్తి ఉచితం. ఎకో ఫ్రెండ్లీ పేపర్ ప్రింటెడ్ ద్వారా ప్రయాణికులు ఈజీగా చదువుకోవచ్చు. యూకేలో ప్రతి ఏడాదిలో 53 మిలియన్ల పుస్తకాల వరకు అసంపూర్తిగా ఉండిపోతున్నట్టు కెనరీ వ్రాఫ్ గుర్తించింది. సోషల్ మీడియా కారణంగా చాలామంది ఈ పుస్తకాలను చదివే సమయం లేకుండా పోతుందని రీసెర్చ్ లో గుర్తించారు. అందుకే ఈ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా అందరిని రీడింగ్ స్టోరీలు చదివించడమే కాదు.. స్మార్ట్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచేందుకు ఈ వెండింగ్ మిషన్లు ఎంతో ఉపకరిస్తాయని కెనరీ వ్రాఫ్ చెబుతోంది.
Also Read : ఫాస్టర్ డేటా స్పీడ్ : కొత్త టెక్నాలజీ Wi-Fi 6 వచ్చేస్తోంది