Venezuela Dance : యునెస్కో గుర్తించిన వింత ఆచారం..కరోనా పోవాలంటూ..దెయ్యం డ్యాన్స్

యునెస్కో గుర్తంపు పొందిన ‘నజరీన్’ వేడుకల్లో కరోనా నినాదం వినిపించింది. వెనుజులాలో ఓ తెగ ప్రజలు నజరీన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ఈ దెయ్యాల వలె వేషాలు వేసుకుని గో కరోనా గో అంటూ నినాదాలు చేశారు.

Venezuela Dance : యునెస్కో గుర్తించిన వింత ఆచారం..కరోనా పోవాలంటూ..దెయ్యం డ్యాన్స్

‘nazarene’ Celebrations (3)

Venezuela Dance : గో కరోనా గో అంటూ ఎంతోమంది పూజలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కరోనా దేవి అంటూ విగ్రహాలు ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. కానీ ఏకంగా యునెస్కో గుర్తించిన ఓ వింత ఆచారాన్ని పాటించిన ప్రజలు కూడా గో కరోనా గో అంటూవీధుల్లోకి వచ్చి దెయ్యం గెటప్ లు వేసుకుని డ్యాన్సులు చేశారు. వెనిజులాలోని గ్వాజిరా ప్రాంతంలో నివసించే ఓ తెగ ప్రజలు ప్రతి ఏడాది ‘నజరీన్’ పేరుతో వేడుకలు జరుపుకుంటారు.

వింత వింత వేషాలు వేసుకుని డ్యాన్సులు వేస్తారు. ఈ నృత్య వేడుకలకు యునెస్కో గుర్తింపు కూడా ఉంది. వీరి పూర్వీకులు ఆఫ్రికా నుంచి వలసవచ్చారు. వీరు కేథలిక్ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. కాగా, నజరీన్ వేడుకలో భాగంగా వారు వివిధ వేషధారణలతో రోడ్లపైకి వచ్చి దెయ్యాల డ్యాన్స్ చేస్తుంటారు.

ఈ ఏడాది కూడా గ్వాజిరా సముద్ర తీరప్రాంత పట్టణాల్లో ‘నజరీన్’ వేడుకలు జరిపారు. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిచే మహమ్మారి కరోనా. ఈ కరోనానే నజరీన్ వేడుకల్లో నినాదంగా మారింది. కరోనాను పారదోలేందుకు వెనుజులా గ్వాజిరా వాసులు దెయ్యాల డ్యాన్స్ చేశారు. చెడుపై మంచి గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని వీరు ప్రతి ఏటా నజరీన్ నిర్వహిస్తుంటారు. ఈసారి కరోనా మహమ్మారిపై మానవాళి గెలవాలన్న సదుద్దేశంతో ఈ తెగ ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేశారు.