వావ్..ఎంత పెద్ద అరటిపండో..వెరీ వెరీ టేస్టీ

వావ్..ఎంత పెద్ద అరటిపండో..వెరీ వెరీ టేస్టీ

Very Big Banana: ఈ అరటిపండును చూస్తే ఎవ్వరైనా సరే..వావ్ అనాల్సిందే.ఎందుకంటే దాని సైజు అంతుంది మరి. ఇప్పటి వరకూ చాలా పెద్ద పెద్ద్ కూరగాయాల్ని చూసి ఉంటాం. కానీ ఇంత పెద్ద అరటిపండును చూసి ఉండరు. సాధారణంగా పెద్ద సైజులో ఉండే అరటిపండ్ల కంటే ఏకంగా మూడు రెట్లు పెద్ద సైజులో ఉందీ అరటిపండు. యూకేలోని ఇంగ్లండ్‌లో ఓ మహిళ… సోషల్ మీడియాలో పెట్టిన ఈ పెద్ద అరటిపండు ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఎంత పెద్ద అరటిపండు అంటే..ఆమె చెయ్యి (మూర) అంటే అడుగు సైజులో ఉందీ పండు సైజు. సోషల్ మీడియాలో ఆ అరటిపండును చూసినవారుకూడా వావ్ అంటున్నారు. అది ఒక్కటి తింటే పొట్ట నిండిపోవటం ఖాయం. ఈ పెద్ద అరటిపండును సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఇంగ్లండ్ మహిళ పేరు పౌలా. వయసు 45 ఏళ్లు.

ఇంట్లోకి సామాన్ల కోసం షాపింగ్‌కి వెళ్లగా అక్కడ మర్కెట్ లో సరుకులతో పాటు అరటిపళ్లు కొంది. మామూలుగానే సరుకు పట్టుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికొచ్చాక..సంచిలోంచి సరుకులు తీస్తూ పేద్ద అరటిపండుని చూసి ఆశ్చర్యపోయింది. వావ్..ఎంత పెద్ద బనానా? ఇంత సైజుది ఎప్పుడూ చూడలేదే?అంటూ ఆశ్చర్యపోయింది.

మిగతా అరటిపండ్ల కంటే ఒకటి మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద అరటి పండును నా జీవితంలో చూడలేదు అంటూ ఆ అరటిపండును పలు యాంగిల్స్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది మామూలు అరటి పండ్ల కంటే 2, 3 రెట్లు పెద్దగా ఉంది అని చెప్పింది. కానీ ఆ 12 అంగుళాల బనానా చాలా రుచికరంగా ఉంది అని ఆమె తెలిపింది. అంటే అడుగు సైజు బనానా అన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందట. ఈ అరటిపండు చెట్టున ఉండగా..దానికి రోజువారీ పొటోషియం అందాల్సిన దాని కంటే ఎక్కువగా అంది ఉంటుందనీ… అందుకే అది అంతలా పెరిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు.