ఔరా.. ఏం తెలివి : యాక్టింగ్ డాగ్‌కు ఆస్కార్ ఇచ్చేయొచ్చు 

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 10:47 AM IST
ఔరా.. ఏం తెలివి : యాక్టింగ్ డాగ్‌కు ఆస్కార్ ఇచ్చేయొచ్చు 

సినిమాల్లో కుక్కలు, కోతులు, పిల్లులు యాక్టింగ్ చేయటం చూశాం. రోడ్డుపై భిక్షగాళ్లు కళ్లు లేవనీ..కాళ్లు లేవని యాక్టింగ్ చేస్తు అడుక్కోవటం చూశాం. కానీ ఓ కుక్క తెగ యాక్టింగ్ చేసేస్తూ..మనుషుల్ని బకరాల్ని చేసేస్తూ చక్కగా ఫుడ్ సంపాదించేస్తోంది.  యాక్షన్ చూస్తే కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయాల్సిందే.ఆ రేంజ్ లో ఉంది దాని యాక్టింగ్. మనుషులను మించిపోయింది. 

కాలు విరిగిపోయినట్లు..థాయ్‌లాండ్‌ రోడ్లపై కాలు ఈడ్చుకుంటు నడుస్తున్న ఆ కుక్కను చూసి అందరూ జాలి పడుతున్నారు. అయ్యో పాపం అని  ఆహారాన్ని అందిస్తున్నారు. కానీ దానికి కాలు విరగలేదు…వట్టిగానే అలా యాక్టింగ్ చేస్తోందని తెలిసి ఔరా..ఏమీ ఈ శునకం తెలివితేటలు అని ఆశ్చర్యపోతున్నారు ఈ యాక్టింగ్ డాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ అతి తెలివితేటలున్న కుక్కను బ్యాంకాక్ ప్రజలు గాయ్ అని పిలుస్తున్నారు. తమను మోసం చేస్తోందని తెలిసి కూడా ఆహారం వేస్తున్నారు. దాని తెలివితేటలకు ముచ్చటపడి దానికి ఆహారం వేటం మానటంలేదు. అది అలా ఎలా నటించగలుగుతుందన్నది కొందరు ఆశ్చర్యపోతుంటే..ఇలా ఎన్నాళ్లి నుంచి మనుషుల్ని బురిడీ కొట్టిస్తోంది దొంగ కుక్క అంటూ ముద్దుగా విసుక్కుంటున్నారు. 

కొన్నేళ్లుగా ఈ కుక్క  ఆ ట్రిక్స్ ప్లే చేస్తోందని స్థానిక చోంగ్పాపోల్కుల్ అనే వ్యక్తి తెలిపారు. ట్కిక్స్ చేస్తోందని తెలిసి కూడా చోంగ్పాపోల్కుల్… దానికి రోజూ ఫుడ్ పెడుతున్నారు. అయినాసరే..రకరకాల రుచులు మరిగిన అది  రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు, ప్రజలను అవిటితనం నటిస్తూ ఆకర్షిస్తోంది రకరకాల ఫుడ్ ను కొట్టేస్తోంది. అదేనండీ సంపాదిస్తోంది. అంతేకాదు దీనికి మరో ఆఫర్ కూడా ఉంది. ఎప్పుడైనా దీనికి నిజంగానే ప్రమాదం జరిగి… ఏ కాలో విరిగిపోతే…దాన్ని తానే పెంచుకుంటానంటు పెట్ డాగ్ షాప్ ఓనర్ హామీ ఇచ్చారు. సో… గాయ్‌కి ఎటువంటి బాధా లేదు.