మాల్యాకు బిగ్ షాక్: అప్పగింతకు బ్రిటన్ అంగీకారం

లండన్ : ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఆర్థిక నేరస్తుడి అప్పగింతకు మార్గం సుగమం అయ్యింది. 9వేల కోట్ల రూపాయల మేర భారత బ్యాంకులకు టోకరా పెట్టి.. బ్రిటన్‌కు

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 02:26 AM IST
మాల్యాకు బిగ్ షాక్: అప్పగింతకు బ్రిటన్ అంగీకారం

లండన్ : ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఆర్థిక నేరస్తుడి అప్పగింతకు మార్గం సుగమం అయ్యింది. 9వేల కోట్ల రూపాయల మేర భారత బ్యాంకులకు టోకరా పెట్టి.. బ్రిటన్‌కు

లండన్ : ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఆర్థిక నేరస్తుడి అప్పగింతకు మార్గం సుగమం అయ్యింది. 9వేల కోట్ల రూపాయల మేర భారత బ్యాంకులకు టోకరా పెట్టి.. బ్రిటన్‌కు పారిపోయిన  పారిశ్రామికవేత్త, ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యాకు చుక్కెదురైంది. ఇంతకాలం భారత్‌కు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తూ కోర్టుల ద్వారా తప్పించుకున్న మాల్యాకు.. బ్రిటన్ షాకిచ్చింది. మాల్యాను  భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించి బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.

 

విజయ్‌ మాల్యాను భారత్‌కు పంపించడానికి మార్గం సుగమం అయ్యింది. విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించడానికి బ్రిటన్‌ అంగీకారం తెలిపింది. మాల్యా అప్పగింతకు సంబంధించిన ఫైలుపై  బ్రిటన్‌ హోంమంత్రి సాజిద్‌ 2019, ఫిబ్రవరి 4వ తేదీ సోమవారమే సంతకం చేశారు. అయితే అప్పగింతకు ముందు ఆఖరిసారిగా తన వాదన వినిపించుకునేందుకుగాను అప్పీలు చేయడానికి  ఆయనకు అవకాశమిచ్చారు. రెండు వారాల్లోగా ఆయన తన అప్పీలును హైకోర్టులో దాఖలు చేయాలి. ఒకవేల అందులోనూ ప్రతికూలంగా తీర్పు వస్తే ఆయన బ్రిటన్‌ సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. ఈ ప్రక్రియ అంతా ముగియడానికి మరో 7 నుంచి 8 నెలలు పట్టవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.

 

విజయ్‌మాల్యా భారత్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని, నకిలీ పత్రాలతో రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలపై వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు సాక్ష్యాధారాలు లభించాయి. దీంతో 2018 డిసెంబర్‌  10న మాల్యాను భారత్‌కు అప్పగించే విషయం పరిశీలించాలని కోర్టు తీర్పునిచ్చింది. మాల్యాకు ఈ తీర్పు పెద్ద దెబ్బ. సాధారణంగా బ్రిటన్‌ కోర్టుల ఆదేశాలకు ప్రభుత్వాలు మోకాలడ్డవు. మాల్యా  మోసాలకు పాల్పడ్డారన్న అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు ప్రకటించిన హోంశాఖ మంత్రి సంతకం చేశారు.

 

మరోవైపు బ్రిటన్‌ హోంశాఖ క్లియరెన్స్‌ను భారత్‌ స్వాగతించింది. సాధ్యమైనంత తొందరగా బ్రిటన్‌లో న్యాయప్రక్రియ పూర్తై భారత్‌ కోరిన విధంగా మాల్యాను అప్పగిస్తారన్న ఆశాభావాన్ని  విదేశాంగశాఖ వ్యక్తీకరించింది. మాల్యా అప్పగింత వ్యవహారంలో మరో మెట్టును కేంద్రం అధిగమించగలిగిందని అమెరికాలో చికిత్స పొందుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఓ ట్వీట్‌లో తెలిపారు.  మాల్యాను రప్పించే పనిలో మోడీ సర్కార్‌ నిమగ్నమైందని, విపక్షాలు మాత్రం శారదా స్కామ్‌ నిందితులకు సంఘీభావం పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. మొత్తానికి మాల్యాను  అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించడంతో భారత్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.