వియత్నాం, మంగోలియాలో ఇప్పటికీ కరోనా మరణాల్లేవు! ఎలా నిరోధించాయంటే?

  • Published By: srihari ,Published On : June 3, 2020 / 12:39 PM IST
వియత్నాం, మంగోలియాలో ఇప్పటికీ కరోనా మరణాల్లేవు! ఎలా నిరోధించాయంటే?

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకూ 3, 77,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాలు కరోనాను విజయవంతంగా కట్టడి చేశాయి. అందులో ప్రధానంగా వినిపించే దేశాలు న్యూజిలాండ్, సౌత్ కొరియా.. ఈ రెండు దేశాలు కరోనాను జయించాయి. ఒక్క కరోనా మరణం నమోదు కాకుండా జాగ్రత్త పడ్డాయి. చైనా ప్రధాన భూభాగానికి బయట ముందుగా వైరస్ వ్యాపించినప్పటికీ ఈ రెండు దేశాలు కరోనాను గట్టిగానే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. న్యూజిలాండ్, దక్షిణ కొరియాతో పాటు మరో రెండు దేశాలైన వియత్నాం, మంగోలియాలు ఒక్క కొవిడ్-19 మరణం నమోదు కాకుండా కంట్రోల్ చేశాయి. 
covid

హ్యుమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ (HDI)లో రెండు దేశాలకు మంచి రేటింగ్ కూడా లేదు. ప్రత్యేకించి ఆరోగ్య భద్రత వ్యవస్థలు కూడా పటిష్టంగా లేవు.. అయినప్పటికీ కరోనాను నియంత్రించడంలో సక్సెస్ సాధించాయి. వియత్నాంలో మొత్తం 328 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.

మంగోలియాలో మొత్తం 189 కరోనా కేసులు ఉంటే.. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. వియత్నాంలో జనాభా 9.5 కోట్లుగా ఉంటే.. మంగోలియాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇంతకీ వియత్నాం, మంగోలియా దేశాలు కరోనాను ఎలా ఎదుర్కొన్నాయి? ఎలాంటి వ్యూహాలను అమలు చేశాయో తెలుసుకుందాం.. 
Viyatnam

వియత్నాం :
ఫిబ్రవరి 1న వియత్నం కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా చైనా నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. ల్యునర్ న్యూ ఇయర్ కు బ్రేక్ పడిన తర్వాత నుంచి స్కూళ్లను కూడా మూసివేసింది. రెండు వారాల తర్వాత Vinh Phuc ప్రావిన్స్‌, నార్త్ ఆఫ్ హనోయ్‌లో 21 రోజుల క్వారంటైన్ విధించింది. చైనా, వుహాన్ నుంచే తిరిగి వచ్చే వలస కార్మికుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కో నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకు వెళ్లింది. 

కాంటాక్టుల ట్రేసింగ్ :
ట్రేసింగ్ మెథడ్‍‌ను సమర్థవంతంగా వియత్నాం అములు చేసింది. ఇతర దేశాల కంటే ముందుగానే మహమ్మారిని కట్టడి చేసింది. భారీ సంఖ్యలో ప్రజలను ట్రేస్ చేయడమే కాకుండా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా నిరోధించింది. వైరస్ సోకిన వ్యక్తిని కలిసిన కాంటాక్టులను గుర్తించి వైరస్ చైన్ బ్రేక్ కట్ చేసింది. 

కమ్యూనికేషన్ :
కరోనా నియంత్రణలో భాగంగా వియత్నాం సాంకేతికతను బాగా వినియోగించుకుంది. ప్రజలకు సమాచారాన్ని అందించడంలో టీవీ, రేడియో, వార్తాపత్రికలు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లను సాధ్యమైనంతవరకు వినియోగించింది. ప్రభుత్వం రూపొందించిన హ్యాండ్ వాష్ కు సంబంధించి పాప్ సాంగ్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 
Vythanm

మంగోలియా :
కంటైన్మెంట్ వ్యూహాంతో పాటు కఠినమైన చర్యలను చేపట్టింది మంగోలియా. ఫిబ్రవరి మధ్యలో కరోనా వైరస్ చైనా సరిహద్దులు దాటిన క్రమంలో మంగోలియన్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. Tsagaan Sar జాతీయ సెలవుదినాన్ని రద్దు చేసింది.

అంతేకాదు.. రాజధాని నుంచి Ulaanbaatar బయటి ప్రావెన్స్ మధ్య రవాణా సర్వీసులను అన్నింటిని రద్దు చేసింది. అంతేకాదు.. చైనా, రష్యా సరిహద్దులను కూడా మంగోలియా మూసివేసింది. సరిహద్దుల్లో రాకపోకలను నియంత్రించింది. దక్షిణ కొరియా లాంటి కరోనా హాట్ స్పాట్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమానశ్రయాలను కూడా రద్దు చేసింది. ఇలాంటి చర్యలతోనే మంగోలియా కొవిడ్ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకుంది.